కరువు మండలాల్లో బోయినిపల్లిని చేర్చాలి - బీజేపీ ధర్నా..
సూర్య బోయినపల్లి..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల జాబితాలో బోయినపల్లి మండలానికి చోటు కల్పించకపోవడాన్ని నిరసిస్తూ బుధవారం బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మండల అధ్యక్షుడు ఎడపల్లి పరశురామ్ నాయకత్వంలో తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా పరశురామ్ మాట్లాడుతూ, బోయినపల్లి మండలాన్ని విస్మరించడం రైతాంగానికి అన్యాయం అన్నారు. సాగునీటి కొరత, పంటల సాగులో ఇబ్బందులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తక్షణమే స్పందించి బోయినపల్లిని కరువు మండలంగా ప్రకటించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు.ప్రభుత్వం స్పందించకపోతే మరింత ఉధృతంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కమిటీ సభ్యులు ఉదారి నరసింహ చారి స్తంభంపెళ్లి సర్పంచ్ బొంగాని అశోక్ గౌడ్ మాజీ మండల అధ్యక్షుడు గుడి రవీందర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి రాజేంద్రప్రసాద్, మండల ఉపాధ్యక్షులు కందారపు వెంకటేష్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు సుంకపాక ప్రభు, సీనియర్ నాయకులు స్వామి కుమార్, మినుకుల శ్రీనివాస్ ,మహేష్, వెంకటేష్, తిరుపతి ,దూస శ్రీకాంత్, అనిల్, నరేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.