BREAKING
శ్రీలంక తోట కార్మికులకు భారత్ గృహ నిర్మాణ ప్రాజెక్టు విస్తరణ మార్కెట్ ర్యాలీకి ప్రైవేట్ బ్యాంకుల బాట..9 బ్యాంకుల లక్ష్య ధరలు పెంచిన జెఫరీస్ గూగుల్‌పై మలేసియా నియంత్రణ సంస్థ దావా ‎అమ్మా చదువులమ్మా వందనం ‎‎..ఆథ్యాత్మికం రియాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ టవర్‌పై దాడిని ఖండించిన భారత్ ఢిల్లీలో ఈ సీజన్ అత్యల్ప ఉష్ణోగ్రత 52 వారాల కనిష్ఠానికి టాటా స్టీల్ షేర్లు.. అపోలో డీల్ దీర్ఘకాలంలో సానుకూలమేనా? టికెట్ దక్కలేదని కుంగిపోలేదు.. -భార్యను బరిలో దించి సత్తా చాటిన తలారి బాల -ఇండిపెండెంట్ గా అఖండ విజయం. సర్పంచ్ టీడీపీ అభ్యర్థుల గెలుపుతో గ్రామాల అభివృద్ధి కి పునాది ఎంపీపీ దేవినేని రమ కోటేశ్వరరావు శబరిమలలో అపరిశుభ్ర దుకాణాలకు రూ. లక్ష జరిమానా ఇఫీ 2026లో గుజరాతీ చిత్రం ‘లాలలో కృష్ణ సదా సహాయతే’ సందడి జాతీయ పాల దినోత్సవం 2026 వేడుకలకు పాట్నా వేదిక నక్సలిజం నిర్మూలనలో కీలక మైలురాయి అమెరికా, చైనాలకు దీటుగా యూరోపియన్ యూనియన్ వ్యూహం ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు రష్యాతో వాణిజ్య ఒప్పందాల ప్రతిపాదనలు పక్కనబెట్టిన అమెరికా

కాంగ్రెస్ తోనే పట్టణ అభివృద్ధి

Select Suryaa Now
కాంగ్రెస్ తోనే పట్టణ అభివృద్ధి

 

-పురపాలిక చైర్ పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి

మరిపెడ ప్రతినిధి,
డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోతు రాంచంద్రు నాయక్  నాయకత్వంలో  మరిపెడ పట్టణం అభివృద్ధిలో దూసుకుపోతుందని మున్సిపల్ చైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి అన్నారు.మున్సిపల్ పరిధిలోని 5వ వార్డులో కొనసాగుతున్న సైడ్ డ్రైనేజీ పనులను  చైర్‌పర్సన్  గురువారం మున్సిపల్ కమిషనర్ నరేష్ రెడ్డితో కలిసి పరిశీలించారు.వార్డులో ఇప్పటికే కొనసాగుతున్న డ్రైనేజీ పనుల పురోగతిని పరిశీలించిన చైర్‌పర్సన్, చేపట్టాల్సిన మిగిలిన పనులపై అధికారులతో చర్చించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా డ్రైనేజీ పనులను వేగవంతంగా పూర్తి చేయడంతో పాటు, పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు.వర్షాకాలంలో మురుగు నీరు నిల్వ కాకుండా, ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య వసతులు అందేలా అవసరమైన ప్రాంతాల్లో సైడ్ డ్రైనేజీ పనులను చేపట్టాలని ఆమె పేర్కొన్నారు. ప్రజల సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ మున్సిపల్ పరిధిలో అభివృద్ధి పనులను కొనసాగిస్తున్నామని తెలిపారు.ఈ పరిశీలనలో కౌన్సిలర్లు బోడ భాస్కర్, పానుగోతు రాములు, షేక్ ఆఫ్జల్, బోడ రవి, బోడ శ్రీను తదితరులు పాల్గొన్నారు.అనంతరం,రానున్న బతుకమ్మ పండుగను పురస్కరించుకొని నూతనంగా చేపట్టిన బతుకమ్మ ప్రాంగణంను కౌన్సిలర్లు గంట్ల గౌతమ్ రెడ్డి, గంట్ల సుజాత మహిపాల్ రెడ్డి లతో కలసి పరిశీలించారు. పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. అంతకుముందు కొండసముద్రం బతుకమ్మ ఘాట్ ను పరిశీలించి, చేపట్టాల్సిన పారిశుధ్య పనులను మున్సిపల్ సిబ్బందికి ఆదేశించారు.బతుకమ్మ వేడుకల్లో మహిళలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు. వారివెంట  కో ఆప్షన్ సభ్యుడు షేక్ అజీజ్, షేక్ తాజోద్దీన్,కుడితి నరసింహ రెడ్డి, ముదిరెడ్డి పవన్ రెడ్డి, వెర్మారెడ్డి సంతోష్ రెడ్డి, ముదిరెడ్డి నరేష్ రెడ్డి తదితరులు ఉన్నారు.