BREAKING
మ‌ల్లారెడ్డిపేటలో ఘ‌నంగా బ‌తుక‌మ్మ వేడుక‌లు మల్కాపూర్‌లో ఘనంగా స్వేరోస్ డే వేడుకలు పేటేరు గ్రామంలో పొలంబడి కార్యక్రమం పేదల ఆకలి తీర్చిన పోరాటయోధుడు పండుగ సాయన్న బాబా పిలుపుతో పుస్తకావిష్కరణ ఒక్క ఓటు మిస్ కావద్దు... మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు *అల్లం పంటలో కొత్త తెగులు.. కేంద్ర బృందం క్షేత్రస్థాయి పరిశీలన!* వెంకటాపూర్ గ్రామంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు *పిచ్చరాగడి తాండలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ* అభివృద్ధిని చూసి...ఆదరించండి : ఎమ్మెల్యే కన్నా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఉప్పల వెంకటేష్ పెద్దాపూర్ వద్ద వినాయక్ పెట్రోల్ బంక్ ప్రారంభించిన టీజి ఐ ఐ సి మాజీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి పెద్దాపూర్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు బాధితుడికి బంగారు గొలుసు అప్పగింత ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి

జనగణన పక్కాగా చేపట్టాలి!

Select Suryaa Now
జనగణన పక్కాగా చేపట్టాలి!

మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి

అధికారులకు శిక్షణలో కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి  దిశానిర్దేశం

రంగారెడ్డి :  జిల్లాలో ఫేజ్ -2 జనగణనను ఖచ్చితత్వంతో, క్రమబద్ధంగా చేపట్టి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అధికారులకు సూచించారు. జనగణన కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన రెండు రోజుల శిక్షణ గురువారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అధికారులు మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. తమ పరిధిలో గణన సజావుగా సాగేందుకు పర్యవేక్షణ చేపట్టాలని, సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

శిక్షణలో జనగణన విధివిధానాలు, అధికారుల బాధ్యతలు, శాఖల మధ్య సమన్వయం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. గణనలో ఖచ్చితత్వం పాటించడం, నిర్ణీత సమయంలో ప్రక్రియను పూర్తి చేయాల్సిన అవసరాన్ని వివరించారు. శుక్రవారం కూడా శిక్షణ కొనసాగనుంది. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు, రంగారెడ్డి, మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాల రెవెన్యూ అధికారులు, ఆర్డీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.

రంగారెడ్డి, మేజర్ న్యూస్ (అక్టోబర్ 22)