BREAKING
చదువుతో పాటు మంచి వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవాలిః గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రేక్షకుల ప్రేమతో పాటు విమర్శలనూ వినయంగా స్వీకరించాలి.. ఆల్ఫా స్పందనపై నటి శర్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చిత్తూరులో రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు సర్వం సిద్ధం! డిసెంబర్ 12, 13, 14 తేదీల్లో పీవీకేఎన్ కళాశాల మైదానంలో సీనియర్ సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్ పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్.. రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి మంది క్రీడాకారుల రాక కట్టుదిట్టమైన భద్రతలోనూ చిన్నారి అభిమానిని ఆప్యాయంగా పలకరించిన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్ ప్రత్యేక అవసరాల పిల్లలకు ప్రతిభ వెలికితీతకు క్రీడా పోటీలు దోహదం సర్పంచ్ పూజారీ ఈశ్వరమ్మ బుడ్డయ్య, విద్యార్థుల ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యం ఎంఈఓ బషీర్ అహ్మద్, ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు మండల స్థాయి క్రీడా పోటీలు ఇందిరమ్మ ప్రజా పాలనలో విద్యార్థుల గోడు పట్టదా..? ఎంపీ ఆర్‌.కృష్ణయ్య రూ.1.7 కోట్ల బడ్జెట్‌తో రూ.460 కోట్ల వసూళ్లు.. హనుమాన్ అంశ్ విజయం వెనుక 28 రోజుల ప్రయాణం రామన్నగూడెం తండాలో కేతి బచావో అభియాన్ కార్యక్రమం జ్యోతీరావ్ పూలే కు జర్నలిస్టు నేతల నివాళులు సినీ సంగీతం సమాజానికి అద్దంలాంటిది.. సల్మాన్ ఖాన్ పాట విమర్శలపై జావేద్ అఖ్తర్ కీలక వ్యాఖ్యలు ఘనంగా మహాత్మా జ్యోతిబాపూలే వర్దంతి చిన్నారి పుట్టినరోజు వేడుకలో పర్యావరణ స్ఫూర్తి. పుష్కర్ క్షేత్రంలో శ్రీ బ్రహ్మ దేవుని దర్శించుకున్న అనంతపురం మేయర్ రమేష్ గౌడ్ రామాయణ పార్ట్ 1లో రావణుడిని కీర్తించలేదు.. యశ్ నటన వల్లే ఆదరణ దక్కిందన్న నమిత్ మల్హోత్రా అశోక్ నగర్ సర్పంచ్ కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అర్హులందరూ తక్షణమే ఆన్‌లైన్ నమోదు చేసుకోవాలి – సర్పంచ్ జాధవ్ రాజశేఖర్

Select Suryaa Now
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అర్హులందరూ తక్షణమే ఆన్‌లైన్ నమోదు చేసుకోవాలి – సర్పంచ్ జాధవ్ రాజశేఖర్
సూర్య జైనూర్ : లింగాపూర్ మండల కేంద్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కింద అందించే రూ. 5 లక్షల బీమా సదుపాయాన్ని రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని లింగాపూర్ సర్పంచ్ జాధవ్ రాజశేఖర్ పిలుపునిచ్చారు.​ఈరోజు లింగాపూర్ మండల కేంద్రంలోని రైతువేదికలో గ్రామపంచాయతీ ప్రజల కోసం ప్రత్యేకంగా ఆన్‌లైన్ నమోదు (ఎన్‌రోల్‌మెంట్) శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ అనుకోని ప్రమాదాలు లేదా అకాల మరణం సంభవించినప్పుడు నిరుపేద కుటుంబాలు ఆర్థికంగా చితికిపోకుండా ఉండేందుకు ఈ రూ. 5 లక్షల బీమా రక్షణ కవచంలా పనిచేస్తుందని తెలిపారు. గ్రామంలోని అర్హులైన లబ్ధిదారులందరూ ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా, గడువు ముగియకముందే తమ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి లక్ష్మణ్, వార్డు సభ్యులు రాథోడ్ నారాయణ్, బి ఆర్ ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ జాటోత్ రాహుల్, గ్రామపెద్దలు రాథోడ్ బావురావు, ఆడే బాలు, చవాన్ సోరాజీ, లవ్, యూత్ సభ్యులు జాధవ్ అజ్జు, చవాన్ రాజేష్, చవాన్ కిరణ్ మరియు గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.