BREAKING
దివంగత నటి సౌందర్యతో అనుబంధాన్ని తలచుకుని భావోద్వేగానికి గురైన సీనియర్ హీరోయిన్ ప్రేమ మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కార్మిక నాయకుడు రెడ్డి అప్పలనాయుడు కి ప్రజా సంఘాల మద్దతు కడియంలో జోరందుకున్న నామినేషన్ల పర్వం. డీఎస్పీ పర్యవేక్షణలో పటిష్ట పోలీసు బందోబస్తు నామినేషన్ల సందర్భంగా శాంతిభద్రతల సమస్య తలెత్తకూడదు కడియం ఎంపీపీ అభ్యర్థిగా రాజరాజేశ్వరి జక్కంపూడి రాజా సహా పార్టీ నేతల సంప్రదింపుల అనంతరం నిర్ణయం మెగా హీరోకు లైవ్‌లో ప్రపోజ్ చేసిన యాంకర్ శ్రీముఖి.. ఆయన ఇచ్చిన ఊహించని రిప్లై పి.గన్నవరం మండలంలో రెండో రోజు 33 నామినేషన్లు మల్లవరం పెదలంకలో దసరా నవరాత్రుల మహోత్సవాలు--మహిళల నృత్యాలతో అమ్మవారి ఊరేగింపు జిల్లాలో జడ్పీటీసీ అన్ని స్థానాలకు పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ... కూతుళ్లతో కలిసి బిగ్‌బాస్ నటి చైత్ర రాయ్ దసరా వేడుకలు.. సామాజిక మాధ్యమాలలో ఫొటోలు వైరల్ అనపర్తిలో 28 నామినేషన్లు దాఖలు..ఇప్పటివరకు 49 నామినేషన్లు దాఖలు: కామవరపుకోటలో 49 నామినేషన్లు పిల్లల్లో విపరీతంగా పెరుగుతున్న చదువు ఒత్తిడి.. తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి నేదునూరులో పెళ్లి బృందం వ్యాన్ బోల్తా30 మందికి గాయాలు.. పెదపుల్లేరు జనసేన ఎంపీటీసీ అభ్యర్థిగా పాటూరి మోహన్

ఇల్లందులో ఘనంగా దసరా ఉత్సవాలు-పండుగ వేడుకలతో సందడిగా మారిన పట్టణం

Select Suryaa Now
ఇల్లందులో ఘనంగా దసరా ఉత్సవాలు-పండుగ వేడుకలతో సందడిగా మారిన పట్టణం

సూర్య,ఇల్లందు  చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి (దసరా) పండుగను ఇల్లందు పట్టణంలో ప్రజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణంలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

దసరా పండుగ సందర్భంగా పట్టణంలోని ప్రధాన ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని అమ్మవారికి పూజలు నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలను సందర్శించి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ప్రార్థించారు. పండుగను పురస్కరించుకుని ఇళ్లను అందంగా అలంకరించడంతో పాటు సంప్రదాయ దుస్తులు ధరించి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ఆనందంగా గడిపారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు దసరా పండుగ ప్రతీకగా నిలుస్తుందని పలువురు పేర్కొన్నారు. చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయాన్ని గుర్తుచేసే ఈ పండుగ ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపుతుందని తెలిపారు. దసరా ఉత్సవాల వేదిక వద్ద బ్రాహ్మణులు ప్రత్యేక పూజలను నిర్వహిస్తూ భక్తులకు జమ్మి ఆకును పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ప్రజలు ఒకరికొకరు జమ్మి ఆకులు అందజేసుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
పట్టణంలోని ప్రధాన రహదారులు, మార్కెట్ ప్రాంతాల్లో పండుగ సందడి కనిపించింది. దసరా సందర్భంగా దుకాణాలు, వ్యాపార సముదాయాల వద్ద ప్రజల సందడి నెలకొంది. పండుగను పురస్కరించుకుని ప్రజలు కొత్త వస్తువులు కొనుగోలు చేయడంతో వ్యాపార ప్రాంతాలు కళకళలాడాయి.

మొత్తంగా ఇల్లందు పట్టణంలో దసరా ఉత్సవాలు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరిగాయి. భక్తి, సంప్రదాయం, సోదరభావం కలగలిసిన ఈ వేడుకలు ప్రజల్లో నూతన ఉత్సాహాన్ని  నింపాయి.           *పట్టణంలో దేవతామూర్తుల శావల సందడి*    ఇల్లందు పట్టణంలోని పలు వార్డుల్లో నవరాత్రులు పూజలు అందుకున్న దేవతామూర్తుల సేవలను నిర్వాహకులు ఊరేగింపుగా దసరా ఉత్సవాలు జరుగుతున్న ఫారెస్ట్ గ్రౌండ్ కు తరలించారు. ఈ సందర్భంగా భక్తులు ఆనందోత్సవాలతో డాన్సులు చేస్తూ, బాణసంచా కాల్చుతూ దసరా ఉత్సవాల వేదిక వద్దకు తీసుకువెళ్లి ఉంచడంతో హాజరైన అశేష భక్తజనం దేవతమూర్తులకు పూజలు నిర్వహించారు. అనంతరం రావణ వద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు ఘనంగా నిర్వహించారు.

సూర్య రిపోర్టర్ రాజేష్ ఇల్లందు