BREAKING
పాతపట్నం మేజర్ పంచాయతీలో సైలాడ సతీష్ ప్రభంజనం!. పాతపట్నం మేజర్ పంచాయతీలో సైలాడ సతీష్ ప్రభంజనం. కార్తీక వన సమారాధనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమా ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి : తుమ్మలపల్లి హరికృష్ణ గొల్లపల్లి సర్పంచ్ గా చొక్కా రెడ్డి గారి గీత క్రైస్తవ మత పెద్దలకు కార్పొరేటర్ గోవింద్ కృతజ్ఞతలు కంకిపాడు పోలింగ్ కేంద్రంలో అధికారుల నిర్లక్ష్యం.. అయ్యప్పల నిత్య అన్నదానానికి విశేష స్పందన గురునాథ్ ఆధ్వర్యంలో పదో వార్డు టిడిపి నేతలతో సమావేశం.... ఊపిరితిత్తుల క్యాన్సర్‌పై అవగాహనకు సైక్లథాన్ *రాజ్యాంగ ఫలాలు అందరికీ దక్కాలి * దేశీయ నోట్‌బుక్ పరిశ్రమకు జీఎస్టీ భారం తగ్గించాలి కార్పొరేటర్ ఏడువాక దంపతులకు ఘన సన్మానం శ్రీకొండలమ్మను దర్శించుకున్న 7 వేలమంది భక్తులు భారత్–శ్రీలంక వన్డే టికెట్ల విక్రయానికి ముహూర్తం ఖరారు

గురుకుల బాలికల పాఠశాలలో నీటి సమస్య.. స్పందించి రెండు ట్యాంకర్ల నీరు అందించిన రమేష్ నాయక్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురుకుల పాఠశాలలో నీటి కష్టాలే నిదర్శనం: రామావత్ రమేష్ నాయక్

Select Suryaa Now
గురుకుల బాలికల పాఠశాలలో నీటి సమస్య.. స్పందించి రెండు ట్యాంకర్ల నీరు అందించిన రమేష్ నాయక్  ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురుకుల పాఠశాలలో నీటి కష్టాలే నిదర్శనం: రామావత్ రమేష్ నాయక్

దేవరకొండ మండలం పెంచికల్పహాడ్‌లోని గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థినులు తాగునీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు రామావత్ రమేష్ నాయక్ వెంటనే స్పందించి, రెండు ట్యాంకర్ల నీటిని అందించి విద్యార్థినులకు ఉపశమనం కల్పించారు.ఈ సందర్భంగా రామావత్ రమేష్ నాయక్ మాట్లాడుతూ, గురుకుల పాఠశాలలు పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది అని, అలాంటి పాఠశాలలో కనీస తాగునీటి సౌకర్యం లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి, అసమర్థ పాలనకు నిదర్శనమని విమర్శించారు.ప్రభుత్వం పాఠశాలల్లో కనీస మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించడం లేదని, విద్యార్థుల తాగునీటి సమస్యను కూడా పరిష్కరించలేని పాలకులు వారి విద్య, సంక్షేమంపై ఏ విధంగా శ్రద్ధ చూపుతారని ప్రశ్నించారు. పాలకులు ప్రచార ఆర్భాటాలకు ప్రాధాన్యత ఇస్తున్నారే తప్ప, క్షేత్రస్థాయిలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజల కష్టాల్లో ఎల్లప్పుడూ అండగా ఉంటామని, విద్యార్థులు, ప్రజలు ఎప్పుడు సమస్యతో పిలిచినా స్పందిస్తామని తెలిపారు. గురుకుల పాఠశాలల్లో తాగునీటి సమస్యకు తాత్కాలిక పరిష్కారాలు కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

నీటి ట్యాంకర్లను అందించినందుకు పాఠశాల యాజమాన్యం, విద్యార్థినులు రమేష్ నాయక్‌కు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని రమేష్ నాయక్ పేర్కొన్నారు