BREAKING
కల్యాపూర్ లో కమ్యూనిటీ ఇంకుడు గుంతల నిర్మాణం స్పెయిన్ రైల్వే శాఖలో యూఈ అక్రమాల విచారణ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నేత్ర పరీక్షలు 25వ రోజు అదే జోరు - జాతి ఆరోగ్య మిషన్ కాంట్రాక్టు ఉద్యోగస్తుల సమ్మె బ్రిటన్ గృహ నిర్మాణ రంగంలో సంక్షోభం రామేశ్వర్ పల్లిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు భూమి పూజ సిలువ గుట్ట అక్రమ తవ్వకాలపై సీపీఐ ఆగ్రహం అనుమతులు లేని టపాకాయల  దుకాణాలపై కన్నెత్తి చూడని సంబంధిత అధికారులు అమెరికా మధ్యంతర ఎన్నికల తర్వాత గ్లోబల్ మార్కెట్లలో తీవ్ర ప్రకంపనలు గ్రామాలలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి - మండల ప్రత్యేక అధికారి రెడ్ క్రాస్ తలసేమియా సెంటర్‌కు లక్షన్నర ఆర్థిక సాయం అందజేసిన టిడిపి నాయకులు బస్వాపూర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు షూల పంపిణీ బ్రిటన్ టెలికాం రంగంలో తీవ్ర సంక్షోభం చిన్నారి ప్రాణం తీసిన ఎలక్ట్రిక్ కాంటా ఎండ్రియాల్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన సదస్సు

గ్రామంలో ఘనంగా దండారి సంబరాలు

Select Suryaa Now
 గ్రామంలో ఘనంగా దండారి సంబరాలు
సూర్య జైనూర్ : మండలంలోని జామ్నీ గ్రామంలో ఆదివాసీల సంప్రదాయ పండుగ దండారి వేడుకలు అంబరాన్నంటాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి హాజరై గ్రామస్తులతో కలిసి దండారి నృత్యంలో పాల్గొన్నారు.గోండు ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే దండారి నృత్యాలను యువకులు, మహిళలు ఉత్సాహంగా ప్రదర్శించారు. సంప్రదాయ వేషధారణలు, డప్పుల మోతలు, నృత్యాలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. కళాకారుల ప్రదర్శనలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నాయి.ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యే కోవ లక్ష్మికి ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడంలో ఇటువంటి వేడుకలు కీలకమని పలువురు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు, గ్రామ పెద్దలు, ఆదివాసీ సంఘాల నాయకులు, మహిళలు, యువకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.