telangana
ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు
సూర్య,లింగంపేట్ : లింగంపేట్ మండల కేంద్రంలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా జరిపారు.కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సాయిరాం యాదవ్ గోకుల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ జన్మదిన సంబరాలను పిల్లలతో కలిసి జరుపుకొని సీఎంకు ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా మండల అధ్యక్షుడు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అభివృద్దే ద్యేయంగా పనిచేస్తున్న ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని దేవున్ని వేడుకున్నారు.ఈ వేడుకల్లో సర్పంచ్ కౌడ రవీందర్,పిఏసీసి రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి రఫీయొద్దీన్, టౌన్ అధ్యక్షులు ఉపసర్పంచ్ ప్రసాద్ గౌడ్, ఇందిరమ్మ కమిటీ అధ్యక్షుడు ఎల్లమయ్య,కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గుండా బాలకిషన్, మండల ప్రధాన కార్యదర్శి అర్షద్, ఎస్సీ సెల్ లీడర్ జల్దిపల్లి రాజు, యూత్ నాయకులు సుప్పాల రాజు, శంకర్, లక్ష్మీనారాయణ, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది,పాల్గొన్నారు.