నేటి నుండి కార్తీకమాసం ప్రారంభం భక్తులతో ఆలయాలకు పెరగనున్న సందడి శ్రీ కామేశ్వరి దేవి ఆలయం తెరుచుకునేనా? దేవాదాయ శాఖ అధికారుల తీరుపై భక్తుల ఆగ్రహం
వెల్దుర్తి (మేజర్ న్యూస్): హిందువులు అత్యంత పవిత్రంగా భావించే కార్తీకమాసం సోమవారం నుంచి ప్రారంభం కావడంతో పుణ్యక్షేత్రాలు, శివాలయాలకు భక్తుల రాక పెరగనుంది. ఈ సందర్భంగా ఆలయాల్లో విశేష పూజలు, దీపోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.అయితే వెల్దుర్తి పట్టణ సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ బ్రహ్మగుండేశ్వర స్వామి సన్నిధిలో వెలసిన శ్రీ కామేశ్వరి దేవి ఆలయం సోమవారం రోజు కూడా తెరుచుకోకపోవడంపై భక్తులు దేవాదాయ శాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్తీకమాసం ప్రారంభమైన వేళ అమ్మవారి దర్శనం లభించకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారు స్పందించి నేటి నుండైనా శ్రీ కామేశ్వరి దేవి ఆలయాన్ని తెరచి భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించాలని ఆశిస్తున్నారు.
కార్తీకమాస ముఖ్య పర్వదినాల వివరాలు:
నవంబరు 13: నాగుల చవితి
నవంబరు 16: తొలి కార్తీక సోమవారం
నవంబరు 21: క్షీరాబ్ధి ద్వాదశి
నవంబరు 23: రెండో కార్తీక సోమవారం
నవంబరు 24: కార్తీక పౌర్ణమి
నవంబరు 30: మూడో కార్తీక సోమవారం
డిసెంబరు 07: నాలుగో కార్తీక సోమవారం
డిసెంబరు 08: కార్తీకమాస సమాప్తి
మాసం పొడవునా పవిత్ర స్నానాలు, ఉపవాస దీక్షలు, దీపారాధనలతో ఆలయాలు భక్తజనసందోహంతో నిండిపోనున్నాయి.