BREAKING
దీపావళి వేడుకల్లో ప్రియుడితో సందడి చేసిన కృతి సనన్.. బాలీవుడ్ ప్రముఖుల హాజరు అమెరికా న్యాయశాఖ సివిల్ డివిజన్ అధిపతి రాజీనామా అమెరికా సుప్రీంకోర్టులో దివంగత బేస్‌బాల్ దిగ్గజం రాబర్టో క్లెమెంట్ కుటుంబానికి చుక్కెదురు డైమండ్ దిగ్గజం డీ బీర్స్‌లో వాటాను 30 శాతానికి పెంచుకోనున్న బోత్వానా మైత్రీ మూవీ మేకర్స్ ‘DNK’ ట్రైలర్ విడుదల: ఫుల్ ఆన్‌లైన్ బెట్టింగ్ మానియాతో నవ్వులు పూయిస్తున్న ఎంటర్‌టైనర్ అమెజాన్ అడవుల పరిరక్షణకు భారీ ఆర్థిక సాయం మెడికల్ షాప్ లో తనిఖీ చేసిన డ్రగ్స్ ఇన్స్పెక్టర్ కూటమిపై ప్రజల విశ్వాసానికి ఎన్నికల ఫలితాలే నిదర్శనం గ్రామ పంచాయతీల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం కావాలి : ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ చిలీ కోడెల్కో సంస్థలో ప్రైవేట్ భాగస్వామ్యం తప్పనిసరి పొలిమేర 3 నుంచి యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా 'విరావి' ఫస్ట్ లుక్ గ్లింప్స్ విడుదల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో మార్కెట్ పతనం అతిశయోక్తి, నియంత్రణ భయాలు అనవసరం అమెరికన్ హెల్త్‌కేర్ రంగంలో భారీ ఒప్పందం విద్యార్థులు చదువుకుంటే నీ భవిష్యత్తులో బంగారు భవిష్యత్తు పీఎన్‌సీ బ్యాంక్...కాయిన్‌బేస్‌తో భాగస్వామ్యంతో స్టేబుల్‌కాయిన్ చెల్లింపుల ప్రక్రియ ప్రారంభం రష్యాలో శాంతి చర్చల సంకల్పం కనిపించడం లేదు

ఎట్టకేలకు కడెం నీటిని విడుదల చేసిన అధికారులు, ఆనందంలో రైతులు

Select Suryaa Now
ఎట్టకేలకు కడెం నీటిని విడుదల చేసిన అధికారులు, ఆనందంలో రైతులు

 

సూర్య, జన్నారం : కడెం నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జన్నారం మండలం తపాలాపూర్ రహదారిపై ఆ గ్రామానికి చెందిన రైతులు రోడ్డెక్కి రాస్తారోకో చేయడంతో అధికార యంత్రాంగం స్పందించి ఆఘమేఘాలపై కడెం నీటిని విడుదల చేశారు. దీంతో రైతాంగం ఆనందం వ్యక్తం చేశారు. ఏకంగా మూడు గంటల పాటు రహదారిపై బైఠాయించి నినాదాలు చేయడంతో అటు పోలీసులు, ఇటు నీటిపారుదల శాఖ అధికారులు అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. రైతులు ససేమిరా అంటూ రాస్తారోకో కొనసాగించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జలసాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు నైనాల గోవర్ధన్ మాట్లాడుతూ రైతులు పండించిన పంట చేతికొచ్చే సమయంలో కడెం నీటిని నిలుపుదల చేసి రైతులకు ఇబ్బందులు కలిగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆరు నూరైనా కడెం నీటిని ఆయకట్టు దారులకు ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేయాల్సిందేనని, లేకుంటే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. అదే సమయంలో మంచిర్యాల ఎసిపి ప్రకాష్ అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. ఏ సమస్య ఉన్న శాంతియుతంగా నిరసన తెలుపాలే తప్ప బాటసారులకు ఇబ్బంది కలిగించవద్దని అన్నారు. సమస్యను అధికారులతో మాట్లాడి పరిష్కరించుకుంటే మంచిది అన్నారు. అదేవిధంగా నీటిపారుదల శాఖ డిఈ వెంకటేశం సైతం రైతులతో మాట్లాడారు. జలసాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు నైనాల గోవర్ధన్ హైదరాబాదులోని చీఫ్ ఇంజనీర్ తో ఫోన్లో మాట్లాడారు. ఇక్కడి పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైందని, ఎట్టి పరిస్థితుల్లో నీటిని విడుదల చేయించాలని, లేకుంటే రైతాంగం ఇబ్బంది పడాల్సి వస్తుందని వివరించడంతో ఆఘమేఘాలపై ఆ అధికారి ఫోన్లో కడెం ప్రాజెక్టు ఈఈ ప్రవీణ్ కుమార్ తో మాట్లాడి కడెం నీటిని విడుదల చేయించారు. నీటిని విడుదల చేయించినట్లు రైతులకు ఫోన్లో చెప్పడంతో రాస్తారోకో విరమించారు. దీంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నారు. ఈ రాస్తారోకోలో తపాలాపూర్ మాజీ సర్పంచ్ నైనాల తిరుపతి, చింతగూడ సింగిల్ విండో వైస్ చైర్మన్ కమ్మల విజయ ధర్మ, రైతు నాయకులు మిక్కిలినేని రాజశేఖర్, గ్రామానికి చెందిన రైతులు పాల్గొన్నారు.