ఘనంగా రాష్ట్ర మంత్రి జన్మదిన వేడుకలు
ఆత్మకూరు/ మేజర్ న్యూస్: వనపర్తి జిల్లా అమరచింత మండలం సింగంపేట గ్రామం బాట ఆంజనేయస్వామి దేవాలయం నందు రాష్ట్ర పశుసంవర్ధక క్రీడా శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి జన్మదిన వేడుకలను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగరాజు గౌడ్ ఆదేశానుసారం ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
_రాజారత్నం ,ఆత్మకూరు వనపర్తి జిల్లా.