BREAKING
తిరుపతి కార్పొరేషన్ 1వ డివిజన్ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి అభివృద్ధిని చూడండి -- కూటమి అభ్యర్థులను గెలిపించండి -- జడ్పిటిసి కుంజ నాగమణి, ఎంపీటీసీ బుద్ధ రజిని ని గెలిపించండి -- ప్రచారం నిర్వహించిన టిడిపి నియోజకవర్గ నాయకురాలు పూనెం శశికళ. చిత్తూరులో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్ మధ్యాహ్నం 3 గంటల వరకు 51.2 శాతం ఓటింగ్ నమోదు జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్డులు ఎన్నికల నియమావళి తప్పక పాటించాలి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు పునాది పొట్టి శ్రీరాములు త్యాగం అవనిగడ్డలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఆపదలో అండగా బీజేపీ నాయకులు పలమనేరు మున్సిపల్ పోలింగ్ కేంద్రాలను సందర్శించిన జిల్లా ఎస్పీ తుషార్ డూడి సంక్షేమం, అభివృద్ధిని వివరిస్తూ మంజుప్రియ వెంకటేష్ ఎన్నికల ప్రచారం రికార్డు స్థాయిలో శ్రీ చైతన్య స్కాలర్‌షిప్ టాలెంట్ టెస్ట్‌కు 15,615 మంది విద్యార్థుల హాజరు ఢిల్లీలో జరిగిన ఓటు బచావో దేశ్ బచావో ర్యాలీలో పాల్గొన్న సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి చిత్తూరు నగరంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్* *ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం లాంటిది: ఎంపీ దగ్గుమళ్ళ* ఎంపీడీఓల సమస్యల పరిష్కారానికి టీఎంపీడీఓల సమరశంఖం! మహిళ పర్సు వెతికిపట్టిన సీసీసీ నస్పూర్ పోలీసులు నీరు చేరక ఇబ్బంది పడుతున్న రైతులు ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్

గోల్డెన్ అవర్‌లో గోపిక ప్రాణాలు కాపాడిన రియల్ డాక్టర్లు అత్యవసర విభాగంలో వైద్యుల సమయస్ఫూర్తి.. కీలక చికిత్సతో ప్రాణాపాయం నుంచి రక్షణ

Select Suryaa Now
గోల్డెన్ అవర్‌లో గోపిక ప్రాణాలు కాపాడిన రియల్ డాక్టర్లు  అత్యవసర విభాగంలో వైద్యుల సమయస్ఫూర్తి.. కీలక చికిత్సతో ప్రాణాపాయం నుంచి రక్షణ

అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్ : గోపిక ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రికి చేరుకోగా, అత్యవసర విభాగం (EMD) వైద్యులు గోల్డెన్ అవర్‌లో అందించిన తక్షణ వైద్య సేవలు ఆమె ప్రాణాలను కాపాడడంలో కీలకపాత్ర పోషించాయి. రక్తపోటు పూర్తిగా పడిపోయిన పరిస్థితిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నూరుల్లా ఖాన్, సీఏంఓ డాక్టర్ శ్యామ్ వెంటనే స్పందించి అత్యవసర చికిత్స ప్రారంభించారు.

ముందుగా సెంట్రల్ లైన్ ఏర్పాటు చేసి రక్తం ఎక్కించారు. కుడివైపు ఛాతీలో ఐసీడీ (ICD) ట్యూబ్ అమర్చడంతో పాటు ఈ-ఫాస్ట్ అల్ట్రాసౌండ్ స్కాన్ నిర్వహించారు. ముఖంపై ఉన్న గాయాలకు కుట్లు వేశారు. పరిస్థితికి అనుగుణంగా యాంటీబయాటిక్స్, నొప్పి నివారణ మందులు, ఇతర అత్యవసర ఔషధాలను అందించి రోగి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు కృషి చేశారు.

ఈ చికిత్సలో వైద్యులతో పాటు ఎంఎన్ఓ నందు కూడా సమన్వయంతో పనిచేస్తూ అవసరమైన సహాయాన్ని అందించారు. అత్యవసర విభాగంలోని స్టాఫ్ నర్సులు, టెక్నీషియన్లు సైతం వైద్యులకు సహకరిస్తూ చికిత్స ప్రక్రియలో కీలకంగా వ్యవహరించారు.

వైద్యపరంగా అత్యంత కీలకమైన గోల్డెన్ అవర్‌లో సమయస్ఫూర్తితో స్పందించి, సమన్వయంతో చికిత్స అందించిన అత్యవసర విభాగం వైద్యులు, సిబ్బంది సేవలు అభినందనీయం. వైద్య వృత్తిలో నిబద్ధత, అంకితభావానికి ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తోంది.

 

రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, మేజర్ న్యూస్.