తిరుపతి కార్పొరేషన్ 1వ డివిజన్ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి
తిరుపతి
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ 1వ డివిజన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాన్ని తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా. డాలర్స్ దివాకర్ రెడ్డి సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా అత్యంత ప్రశాంతమైన వాతావరణంలో, పూర్తి పారదర్శకంగా పోలింగ్ ప్రక్రియ జరుగుతోందని తెలిపారు.ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీస్ ఎన్నికల అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టారని తెలిపారు. 1వ డివిజన్ ఓటర్లు ప్రతి ఒక్కరూ తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకుని, తిరుపతి నగర అభివృద్ధికి బాటలు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలన, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో పూర్తి విశ్వాసం ఉందని అన్నారు.