BREAKING
క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న నజ్రియా నజీమ్: నెట్టింట వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫొటోలు! అర్హులందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తాం మొబైల్ ఫోన్ల రికవరీలో కామారెడ్డి పోలీసుల రికార్డు – రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానం - జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర విక్కుర్తిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెరువు కట్టకు బీటలు.. ప్రమాదం పొంచి ఉంది! విశ్రాంత ఉద్యోగి రాంబాబుకు ఏపీ ఎన్జీవో సంఘం నివాళి గూడెం లిఫ్ట్ నుండి వెంటనే సాగునీరు విడుదల చేయాలి - బీజేపీ కిసాన్ మోర్చా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఈ నెల 6 వరకే ప్రజావాణి అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి గూడెం లిఫ్ట్ నుండి వెంటనే సాగునీరు విడుదల చేయాలి రష్యా యుద్ధంలో గాజువాక యువకుడు.. తల్లి కన్నీటి వేదన నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ ప్రజావాణికి 16 ఫిర్యాదులు - జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ప్రజావాణికి వెల్లువెత్తిన సమస్యల వినతులు హైదరాబాద్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ భేటీ! మండలాభివృద్ధికి నిధులు కేటాయించాలని ఎంపికి వినతి

శ్రీ రాజేశ్వరి కాలనీలో నూతన ‘టీపీఆర్ భారత్ పెట్రోల్ పంప్’ ప్రారంభం

Select Suryaa Now
శ్రీ రాజేశ్వరి కాలనీలో నూతన ‘టీపీఆర్ భారత్ పెట్రోల్ పంప్’ ప్రారంభం

అమీన్‌పూర్  ; అమీన్‌పూర్, డివిజన్ పరిధిలోని శ్రీ రాజేశ్వరి కాలనీలో అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేసిన నూతన ‘టీపీఆర్ భారత్ పెట్రోల్ పంప్’ను అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఘనంగా ప్రారంభించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, రిబ్బన్ కట్ చేసి పెట్రోల్ బంక్‌ను వినియోగదారులకు అంకితం చేశారు. అనంతరం తొలి వాహనంలో పెట్రోల్ నింపి లాంఛనంగా సేవలను మొదలుపెట్టారు.ఈ సందర్భంగా తుమ్మల పాండురంగారెడ్డి మాట్లాడుతూ.. అమీన్‌పూర్ పరిధిలో కాలనీలు విస్తరిస్తూ, జనాభాతో పాటు వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. స్థానిక వాహనదారులు ఇంధనం కోసం దూర ప్రాంతాలకు వెళ్లే శ్రమ లేకుండా, రహదారులపై ప్రయాణాలు సాఫీగా సాగేందుకు గాను అన్ని వసతులతో ఈ రెండో బ్రాంచ్‌ను ఇక్కడ అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఇప్పటికే అమీన్‌పూర్ విలేజ్‌లో మొదటి బ్రాంచ్ ద్వారా ప్రజలకు విస్తృత సేవలందిస్తున్నామని, స్థానికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాజేశ్వరి కాలనీలో ఈ నూతన పెట్రోల్ బంక్‌ను ప్రారంభించామని స్పష్టం చేశారు.నాణ్యమైన పెట్రోల్, డీజిల్‌తో పాటు ఖచ్చితమైన కొలతలతో వినియోగదారుల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తమ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాండురంగారెడ్డి కుటుంబ సభ్యులు, స్థానిక ప్రముఖులు, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో కాలనీవాసులు పాల్గొన్నారు.