చర్చిలలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న కూటమి జడ్పీటీసీ అభ్యర్థిని దండమూడి పూజిత
కంకిపాడు, మేజర్ న్యూస్: కంకిపాడు మండల కూటమి జడ్పీటీసీ అభ్యర్థిని దండమూడి పూజిత, ఎంపీటీసీ అభ్యర్థులతో కలిసి ఆదివారం మండలంలోని పలు చర్చిలను సందర్శించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవ మత పెద్దలు, పాస్టర్లు, విశ్వాసులతో ఆమె ఆత్మీయంగా ముచ్చటించారు. ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యం, సుఖసంతోషాలు కలగాలని, కంకిపాడు మండలం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, పెనమలూరు నియోజకవర్గం, కృష్ణాజిల్లా.