చర్చిలను సందర్శించి కూటమి అభ్యర్థులకు మద్దతు కోరిన విక్కుర్తి జయలక్ష్మి
అవనిగడ్డ, మేజర్ న్యూస్: అవనిగడ్డ మండల ఎన్డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీ అభ్యర్థిని విక్కుర్తి జయలక్ష్మి ఆదివారం మండల పరిధిలోని పలు చర్చిలను సందర్శించారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులను కలిసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు తెలిపి వారి విజయానికి సహకరించాలని కోరారు. అనంతరం మండల పరిధిలోని గుడివాకవారిపాలెం, తుంగలవారిపాలెం గ్రామాల్లో వేకనూరు ఎంపీటీసీ సెగ్మెంట్ కూటమి అభ్యర్థిని తుంగల శ్రీలక్ష్మితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, అవనిగడ్డ నియోజకవర్గం, కృష్ణాజిల్లా.