BREAKING
బతుకమ్మ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక: వివేకానంద నగర్‌లో వేడుకల్లో పాల్గొన్న టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్‌! కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి బండి దీప్తి ఇంటి పై దాడి అల్లాపూర్‌ డివిజన్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ" సంబురాలు లక్ష్మణ్‌గౌడ్‌కు ప్రజల ఆధరణ, అభిమానం ఉంది బతుకమ్మ వేడుకల్లో బండి రమేష్‌ అల్లాపూర్‌ డివిజన్‌లో బతుకమ్మ సంబురాలు మాజీ కార్పొరేటర్‌ సబిహాగౌసుద్దీన్‌ అల్లాపూర్‌ దుర్గామాత మండపాల్లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రత్యేక పూజలు! చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర కార్యక్రమం... ప్రారంభించిన పిసిసి చీఫ్ జాతీయ బాండీ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టు సత్తా రన్నరప్‌గా నిలిచిన తెలంగాణ.. మూడు స్వర్ణాలు, ఒక రజత పతకం కైవసం యూసఫ్‌గూడలో ఘనంగా బతుకమ్మ వేడుకలు హంస ఆకారంలో 18 అడుగుల భారీ బతుకమ్మ ఏర్పాటు శరన్నవరాత్రుల్లో భాగంగా ముగ్గుల పోటీల నిర్వహణ ఎండ వెలుతురు.. పౌష్టికాహారం.. ఆటపాటలతో పిల్లల ఎముకలకు బలం! మైనంపల్లి గెస్ట్ హౌస్‌లో వైభవంగా మైసమ్మ తల్లి తెప్పోత్సవం: హాజరైన మల్కాజిగిరి కాంగ్రెస్ ముఖ్య నేతలు! విజయదశమి స్ఫూర్తితో ఎల్లంపేట అభివృద్ధికి కృషి చేస్తాం.. ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలి ఎల్లంపేట మున్సిపల్ చైర్మన్ లావుడియా శ్రీదేవి రమేష్ ప్రజలకు పీఏసీ చైర్మన్ ,ఎమ్మెల్యే గాంధీ దసరా శుభాకాంక్షలు దసరా శుభాకాంక్షలు తెలిపిన రాగం నాగేందర్ యాదవ్ దసరా శుభాకాంక్షలు తెలిపిన మాజీ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ దంపతులు

ఘనంగా బతుకమ్మ వేడుకలు ఆటపాటలతో సందడి చేసిన ఓబిసి రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు వాణి రెడ్డి

Select Suryaa Now
ఘనంగా బతుకమ్మ వేడుకలు ఆటపాటలతో సందడి చేసిన ఓబిసి రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు వాణి రెడ్డి

తెలంగాణ బ్యూరో ప్రతినిధి : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు  చైతన్యపురి కమలానాగర్ చౌరస్తా లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో  మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు, ఆటపాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమానికి ఓబిసి రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు వాణి రెడ్డి హాజరై బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. మహిళలంతా ఒకచోట చేరి ఉత్సాహంగా బతుకమ్మ వేడుకలు జరుపుకోవడం పండుగకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

 తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ పండుగ మహిళల ఐక్యతకు, ఆత్మీయ అనుబంధాలకు ప్రతీకగా నిలుస్తుందని ఈ సందర్భంగా వాణి రెడ్డి  పేర్కొన్నారు. మహిళల కోలాటాలు, బతుకమ్మ పాటలతో వేడుకల ప్రాంగణం సందడిగా మారింది. రంగు రంగుల వస్త్రాలు దసరించిన మహిళలు పిల్లల భాగస్వామ్యంతో బతుకమ్మ వేడుకలు పండుగ శోభను సంతరించుకున్నాయి.