BREAKING
విజయోత్సవ సంబరాలకు ప్రజలు దూరంగా ఉండాలి : డిఎస్పీ శేషు వర్షాలకు వరి పంటకు తీవ్ర నష్టం.. దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు. ఎస్‌ఐఆర్‌-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి..... రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి ఏలూరు జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ పటిష్ట ఏర్పాట్లు ప్రమాద బాధిత టీడీపీ నాయకుడికి చిన్నబాబు ఆర్థిక సహాయం. అత్యాధునిక సాంకేతిక పరికరాలతో భూ రీ సర్వే --జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పులిమామిడి గ్రామంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాలప్రారంభం స్థానిక సంస్థల ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై పిఓ ఏపీఓలకు 2 వ విడత 181 మందికి శిక్షణా కార్యక్రమం. శ్రీ మార్కండేశ్వర స్వామి భజన మండలి ఆధ్వర్యంలో లక్ష బిల్వార్చన వరుస తుఫాన్ల దెబ్బకు వరి రైతు విలవిల.. పంట నష్టం రైతుకు కన్నీళ్లు.. అమితాబ్ బచ్చన్‌కు జయ బచ్చన్ పెట్టిన ముద్దుపేరు: హరివంశ్‌ రాయ్ బచ్చన్ ఎందుకు వారించారంటే! సర్పంచ్ అభ్యర్థిగా సత్యవేణి ప్రజల ముందుకు.. అభివృద్ధికి అండగా ఉంటానన్న మాజీ ఎంపీటీసీ వీర వెంకటరావు ప్రజారోగ్యాన్ని స్ట్రెచర్‌పై పడుకోబెట్టిన తెలంగాణ ప్రభుత్వం!: డా శివ ప్రసాద్ పిల్లలమర్రి శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిత్యావసర ధరల పెరుగుదలపై వైసీపీ వినూత్న నిరసన.. సూపర్ సిక్స్ హామీలు ఏమయ్యాయి?. --గిరిజాల బాబు

-గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో రెండు రోజుల కార్యక్రమం

Select Suryaa Now
-గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో రెండు రోజుల కార్యక్రమం

పటాన్‌చెరు; వ్యాపార రంగంలో సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకునేందుకు అవసరమైన ఆర్థిక పరిజ్ఞానం,ఆచరణాత్మక నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ ఆధ్వర్యంలో రెండు రోజుల యాజమాన్య వికాస కార్యక్రమం నిర్వహించనున్నారు.ఈ నెల 19, 20 తేదీల్లో అకౌంటింగ్, ఫైనాన్స్ విభాగం ఆధ్వర్యంలో ‘సంఖ్యల నుంచి వ్యూహం వరకు.. నిర్వాహక నైపుణ్యం కోసం ఆర్థిక పరిజ్ఞానం 'అనే అంశంపై హైబ్రిడ్ విధానంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.ఫైనాన్స్‌లో అధికారిక నేపథ్యం లేని మేనేజర్లు, వృత్తి నిపుణులకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.ఆర్థిక విశ్లేషణ, వ్యయ నిర్మాణాలు,బడ్జెట్ రూపకల్పన, పెట్టుబడుల అంచనా, మూలధన కేటాయింపు, పెట్టుబడిపై రాబడి వంటి అంశాలపై ఆచరణాత్మక అవగాహన కల్పించనున్నారు. వాస్తవ వ్యాపార పరిస్థితులు, కేస్ స్టడీల ద్వారా ఆర్థిక నిర్ణయాలు తీసుకునే నైపుణ్యాలను పెంపొందించనున్నారు.ఈ కార్యక్రమాన్ని గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ అకౌంటింగ్, ఫైనాన్స్ విభాగానికి చెందిన డాక్టర్ సుశోభన్ పాల్,డాక్టర్ మెరుగు వేణుగోపాల్ నిర్వహించనున్నారు. పాల్గొనే వారికి అభ్యాస సామగ్రితో పాటు ధ్రువీకరణ పత్రాలు అందజేయనున్నారు. ఆసక్తి ఉన్నవారు పేర్ల నమోదు, రుసుము వివరాల కోసం 84209 66501 నంబర్‌ను సంప్రదించాలని లేదా cbe@gitam.eduకు ఈ-మెయిల్ చేయాలని నిర్వాహకులు సూచించారు.