telangana
గడి బురుజు ఏళ్ల చరిత్రను కాపాడుకుందాం - కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్
సూర్య కోరుట్ల అర్బన్ : ఎన్నో ఏళ్ల చారిత్రక కట్టాడలైన గడి బురుజు స్థలాలు ఆక్రమణకు గురికాకుండా మనమంతా ఒక్కటై కాపాడుకుందామని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు.పట్టణంలోని గడి బురుజు స్థలాల రక్షణకై ధర్నాను బుధవారం చేపట్టారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజుల కాలంనాటి నుండి గడి బురుజులు కోరుట్ల వారసత్వపు ఆస్తి అని,ఈ ఆస్తి అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.మన తాతలు లు,ముత్తాతాలు వాడుకుంటూ వచ్చిన కోరుట్ల ఆస్తిని ఎవడో కొట్టేయాలని చూస్తే ఊరుకోమని,పార్టీలకతీతంగా ముందుకు సాగుదామన్నారు. గడి బురుజు స్థలాల రక్షణకై తాను ప్రజల వెంటే ఉంటానని,స్థలాల రక్షణకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టిన వెన్నంటే ఉంటానన్నారు. ఘన చరిత్ర కలిగిన కోట గడి బురుజు స్థలాలను కొందరు దుర్మార్గులు కబ్జా చేయాలని చూస్తున్నారని,అలాంటి వారిని వదిలే ప్రసక్తి లేదన్నారు.ఈ స్థలాల విషయమై తనకు సైతం ఫోన్లు వచ్చాయని,నన్నెవరూ కొనలేరన్నారు. స్థలాల రక్షణకై ఇప్పటి వరకు పద్ధతి ప్రకారంగా అన్ని పనులు చేశామని, మంత్రులకు, అధికారులకు సైతం విన్నవించామన్నారు. స్థానిక మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేసి, సభ్యులు సంతకాలు పెడితే గడి బురుజు స్థలాలకు వేసిన వీఎల్టి రాద్దౌతుందన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దారిశెట్టి రాజేష్, సర్పంచ్ లు నత్తి రాజ్ కుమార్, కౌన్సిలర్ లు వెంకటేష్, ఆయా పార్టీల నాయకులు గడ్డం మధు,చెన్న విశ్వనాథం,ముజహిద్,రహీం పాషా, పేట భాస్కర్, గుడ్ల మనోహర్, ఫహీం,జాల వినోద్, మిట్టపెల్లి రాజశేఖర్,గెల్లె గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.