BREAKING
కోహిర్ మండల ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు టి. సువర్ణ మల్లన్న ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్ రేఖ వెంకట్ రెడ్డి *జిల్లా కలెక్టర్‌ను కలిసి విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సంగారెడ్డి ఎమ్మెల్యే కాంటెస్టెడ్ అభ్యర్థి పులిమామిడి రాజు* *జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శెట్కర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నాయకులు* 27వ వార్డులో '' ఇంటింటికి ..... టీడీపీ''...! అందోల్ నియోజకవర్గం ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి దామోదర్ రాజనర్సింహ అనంతపురం మేయర్‌గా కాంగ్రెస్ విజయం ఖాయం: శాలి దాదా గాంధీ కాంగ్రెస్ పార్టీ కడప మేయర్ అభ్యర్థిగా నగర అధ్యక్షుడు సయ్యద్ గౌస్ పీర్ సతీమణి ప్రొద్దుటూరులో ప్రజాస్వామ్యానికి విఘాతం.. నామినేషన్ పరిశీలనకు వెళ్లకుండా అడ్డుకున్న టీడీపీ శ్రేణులు మహిషాసుర మర్దినిగా దర్శనమిచ్చిన అమ్మవారు లొద్దిపల్లెలో వైభవంగా బోనాల సమర్పణ సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు వజ్రేష్‌ యాదవ్‌కు వినోద్ కుమార్ జన్మదిన శుభాకాంక్షలు శ్రీ ముమ్మదేవి అమ్మవారి కి దర్శించుకున్న ఏఎంసి చైర్మన్ సుధాకర్ రెడ్డి చింతల్‌గట్టు గ్రామ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్ బంటు విద్యాసాగర్ కళ్యాణదుర్గం మున్సిపాలిటీ చైర్ పర్సన్ పదవికి 11 నామినేషన్లు చెల్లుబాటు.

ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి.. ఏఐటియుసి నాయకులు శింగు నరసింహారావు

Select Suryaa Now
ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి.. ఏఐటియుసి నాయకులు శింగు నరసింహారావు

-ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి

-ఏఐటియుసి నాయకులు శింగు నర్సింహారావు

 ఖమ్మం, సూర్య (మేజర్ న్యూస్): ఎన్ హెచ్. ఎం ఉద్యోగుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివక్ష విడనాడి వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐటియుసి జాతీయ సమితి సభ్యులు శింగు నర్సింహారావు డిమాండ్ చేశారు. -ఎన్హెచ్ఎం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు పాలకులు తాత్సరం చేస్తున్నారని ప్రధానమైన రంగాలకు సంబంధించిన ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూల వైఖరి ప్రదర్శించడం లేదని ఆయన ఆరోపించారు. గురువారం ఖమ్మం కలెక్టరేట్ వద్ద గల ధర్నా చౌక్ లో సమ్మె చేస్తున్న ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమ్మెకు ఏఐటియుసి -పక్షాన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈసందర్భంగా నర్సింహారావు మాట్లాడుతూ వైద్య రంగంలో కాంట్రాక్ట్, -అవుటసోర్సింగ్ పేరుతో ఉద్యోగులను నియమించి సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. దేశ వ్యాప్తంగా ఎన్హెచ్ఎంలో 17 లక్షల మంది పని చేస్తుండగా తెలంగాణలో 17వేల మంది దశాబ్ద కాలంగా పనిచేస్తున్నారని శింగు నర్సింహారావు తెలిపారు. వీరి భవిష్యత్తును పాలకులు అంధకారంగా మార్చారని గత్యంతరం లేక శ్రమ దోపిడీకి గురవుతున్నారని వీరికి కనీసం పిఎఫ్, ఈఎస్ఐ తదితర చట్టబద్ధ హక్కులు ఏవి అమలు కావడం లేదని ఆయన తెలిపారు. కనీసం హెల్త్ కార్డులు కూడా లేవని కొన్ని రాష్ట్రాలు వీరిని పర్మినెంట్ చేశారని రాష్ట్రంలో కూడా పర్మినెంట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగులను బెదిరించడం సరికాదన్నారు. మద్దతు తెలియజేసిన వారిలో ఏఐటియుసి జిల్లా గౌరవాధ్యక్షులు గాదె లక్ష్మి నారాయణ పాల్గొన్నారు.