దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్
పరకాల, మేజర్ న్యూస్, దుర్గా మాతను మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ మడికొండ. సంపత్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తి భావాన్ని, ఆధ్యాత్మిక చింతనను పెంపొందిస్తా యని, ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించినారు.ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో ఐక్యతను, భక్తి భావాన్ని పెంపొందించడంతోపాటు మన సంస్కృతి, సాంప్రదాయాలను భావితరాలకు అందించేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు
రిపోర్టర్ ;పురుషోత్తం, పరకాల, హనుమకొండ జిల్లా