దుర్గామాతకు దర్శించుకున్న ఏఎంసీ చైర్మన్ సుధాకర్ రెడ్డి
రాయికోడ్;మండలంలోని శంషోద్దీన్ పూర్ గ్రామంలో కొలువుదీరిన శ్రీ దుర్గామాతను సోమవారం నాడు రాయికోడ్ మునిపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి మరియు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు సమర్పించి, గ్రామం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని ప్రార్థించారు.ఈయొక్క కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సుధాకర్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు బాలాజీ నరసింహులు, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు సంగమేశ్వర్, ఆత్మ కమిటీ డైరెక్టర్ ప్రకాష్, ఉప సర్పంచ్ తుకారాం, గ్రామ కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు ప్రకాష్, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు వెంకటేశం, వార్డు సభ్యులు సీను, శాంతం పాల్గొన్నారు.అలాగే నందం విట్టల్, బ్యాటప్ప, మంచేందర్, సంగయ్య, స్వామి, డేవిడ్, సంగమేష్, బాగువాందాస్, పండరి, ప్రకాష్, అశోక్ తదితరులు, భవాని సేన యువకులు, గ్రామ పెద్దలు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.పూజా కార్యక్రమాల అనంతరం నాయకులు, భక్తులు అమ్మవారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. గ్రామంలో శాంతి, సామరస్యం వెల్లివిరియాలని, ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.