దుర్గామాత మండపాలను సందర్శించిన డి.ఎస్.పి తిరుపతిరావు
గార్ల, మేజర్ న్యూస్, మండలంలో భక్తులు ఏర్పాటు చేసుకున్న దుర్గా మాత మండపాలను మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతి రావు సందర్శించి, పరిశీలించారు. మండల కేంద్రంతో పాటు మండల పరిధి సీతంపేట గ్రామ పంచాయతీ లలో దుర్గా మాత భక్తులు ఏర్పాటు చేసుకున్న మండపాలను ఆయన గురువారం రాత్రి స్వయంగా తిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా మండపాల నిర్వాహకులతో డీఎస్పీ మాట్లాడుతూ..వారి వివరాలను నమోదు చేసుకున్నారు. అనంతరం దుర్గా మాత భక్తులకు పలు జాగ్రత్త సూచనలు చేశారు. డీజే లు పెట్టి ప్రజలను ఇబ్బందులకు గురి చేయొద్దని, శాంతి భద్రతలకు భంగం కలిగించొద్దని హెచ్చరించారు. ప్రశాంత వాతావరణంలో భక్తి శ్రర్ద లతో పండుగ నిమజ్జనాలు జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గార్ల-బయ్యారం సిఐ రవీందర్, ఎస్సైలు సాయికుమార్, ప్రశాంత్, ఎ ఎస్సై వెంకటరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ శ్యామ్, కానిస్టేబుళ్ళు శ్రీను, సిరాజ్ పాషా, సుధాకర్, రామ నర్సయ్య, హోం గార్డులు రాము, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ ;నాగేశ్వరరావు, గార్ల, మహబూబాబాద్ జిల్లా