BREAKING
రేవుపోలవరం అయ్యప్ప పీఠానికి అయ్యప్ప విగ్రహం బహుకరణ! అమెరికా ప్రభుత్వ సేవల్లో టెక్నికల్ లోపాలకు సైబర్ దాడి కారణం కాదు: హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారి వెల్లడి! ఇంట్లో ఈ 10 రకాల మొక్కలు ఉంటే స్వచ్ఛమైన గాలితో పాటు సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం వెల్డింగ్ పని చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి. రష్యాలో కఠిన చట్ట సవరణ: యుద్ధ వ్యతిరేక వ్యాఖ్యలపై భారీ జరిమానాల బిల్లుకు స్టేట్ డూమా తొలి ఆమోదం! సీఎం సభను ప్రతాప్ రెడ్డి అడ్డుకుంటాం అనడం సిగ్గుచేటు ముప్పు గ్రామాల కౌన్సిలర్లు.. మంత్రి నాదెండ్ల మనోహర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎంపీటీసీ లాల్ స్వామి ఎస్.రాయవరంలో అంగరంగ వైభవంగా అయ్యప్ప పడిపూజ! ఆరోగ్య ప్రయోజనాల ఖజానా తాటి మొలకలు, రాజన్న సిరిసిల్ల మార్కెట్‌లో సందడి చేస్తున్న రుచికరమైన గేగులు ఎన్ ఎం ఎం ఎస్ పరీక్ష వాయిదా. ఎన్‌సీసీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం.. 100 యూనిట్ల రక్తం సేకరణ గ్రామీణ సహకార విశ్లేషణ సదస్సు నిర్వహించిన కే ఎల్ టి హెచ్ యూనివర్సిటీ విధులు పక్కనపెట్టి పోలీసుల చిందులు.. 14 మందిపై చర్యలు! అక్వాన్ తుపానుపై రైతులు జాగ్రత్తగా పాటించాలి 24న పుల్లూరుబండపై సామూహిక సత్యనారాయణ వ్రతాలు

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

Select Suryaa Now
దివ్యాంగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

సిద్దిపేట అర్బన్,  :ఎన్నికల సమయంలో దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని దివ్యాంగుల స్వేచ్ఛ సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కెమ్మసారం అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2023 ఎన్నికల సందర్భంగా దివ్యాంగుల పింఛన్‌ను రూ.4 వేల నుంచి రూ.6 వేలకు పెంచడంతో పాటు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు.మంగళవారం సిద్దిపేట కోమటి చెరువులోని అడ్వెంచర్ పార్క్ వద్ద ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగులు ఎన్నో ఆర్థిక, సామాజిక సమస్యలను ఎదుర్కొంటున్నారని, పెరుగుతున్న నిత్యావసర ధరలతో ప్రస్తుత పింఛన్ వారి కుటుంబ పోషణకు సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దివ్యాంగులకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు స్వేచ్ఛగా ప్రయాణించే అవకాశం కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.బుధవారం జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలో రాజకీయ అంశాలకే పరిమితం కాకుండా దివ్యాంగులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై మాట్లాడాలని కోరారు. పింఛన్ పెంపు, ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని, అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధమని అశోక్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.దివ్యాంగుల సమస్యలపై ప్రభుత్వం మానవీయ దృక్పథంతో స్పందించి, ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కీర్తి సురేష్, అల్లకొండ రాజు, తడకపల్లి లింగం, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.