డిగ్రీ కళాశాలలో ఫుడ్ ఫెస్టివల్
సూర్య, ఆత్మకూరు: ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల వంటకాలను తయారు చేసి తీసుకు వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రతిభ సాధించిన వారికిని అభినందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.