దసరా సంబరాల్లో కాసాని పద్మ, కౌన్సిలర్ ఉదయ జ్యోతి సందడి
సూర్య,అశ్వారావుపేట అశ్వారావుపేట మండలం నారాయణపురంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, బతుకమ్మ వేడుకలు భక్తి పరవశం, ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు. గ్రామంలో పలు చోట్ల ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకలకు అశ్వారావుపేట భారత రాష్ట్ర సమితి నాయకురాలు కాసాని పద్మ, కౌన్సిలర్ డాక్టర్ ఉదయ జ్యోతి హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్థానిక మహిళలు, బతుకమ్మ భక్తులతో కలిసి బతుకమ్మ ఆటపాటల్లో పాల్గొంటూ సందడి చేశారు. సంప్రదాయ దుస్తులు, రంగురంగుల బతుకమ్మలు, మహిళల కోలాటాలు, జానపద గీతాలతో నారాయణపురం గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా మహిళలతో ఆత్మీయంగా మమేకమైన కాసాని పద్మ, కౌన్సిలర్ ఉదయ జ్యోతి వారికి దసరా, బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సందర్భంగా గ్రామంలో నిర్వహించిన భవానీ పాదపూజ కార్యక్రమంలోనూ వారు భక్తులతో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో సాగిన పూజా కార్యక్రమంలో అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ప్రార్థించారు. ఒకవైపు బతుకమ్మ సంబరాలు, మరోవైపు భవానీ పాదపూజతో నారాయణపురంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. మహిళలతో కలిసి సంప్రదాయ పండుగల్లో పాల్గొంటూ, ప్రజలతో మమేకమవుతూ కాసాని పద్మ, కౌన్సిలర్ ఉదయ జ్యోతి వేడుకలకు మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చారు. వీరితోపాటు ఈ కార్యక్రమంలో కాసాని చంద్రమోహన్, సత్యవరపు సంపూర్ణ, గుడవర్తి వెంకటేశ్వరరావు, డాక్టర్ భూక్య ప్రసాద్,ఆరేపల్లి గోవిందం,మరియు స్థానిక నాయుకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని సందడి చేశారు.
సూర్య రిపోర్టర్ మునీర్ అశ్వరావుపేట