చిన్నారుల తల్లిదండ్రులు సరైన సమయంలో టీకాలు ఇప్పించాలి - కమ్యూనిటీ హెల్త్ అధికారి
సూర్య- బిక్కనూర్ : చిన్నారులకు తల్లిదండ్రులు సరైన సమయంలో టీకాలు ఇప్పించాలని, జిల్లా ఉపవైద్యాధికారి కార్యాలయ కమ్యూనిటీ హెల్త్ అధికారి లక్ష్మి సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని ఆరోగ్య ఉప కేంద్రాన్ని సందర్శించి చిన్నారులకు అందజేస్తున్న టీకాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్య ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తల సూచనల మేరకు చిన్నారులకు ఇచ్చే టీకాలను సరైన సమయంలో ఇప్పించాలని, ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య ఎడ్యుకేటర్ బీమ్, ఆరోగ్య విస్తీర్ణ అధికారి వెంకటరమణ, ఆరోగ్య సిబ్బంది లలిత, ఆశా కార్యకర్తలు, చిన్నారులు వారి తల్లిదండ్రులు ఉన్నారు