సూర్య,కాగజ్‌నగర్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం కోసిని గ్రామపంచాయతీ పరిధిలో గుర్తుతెలియని యువకుడు (30) మృతిచెందిన ఘటన ఆదివారం వెలుగుచూసింది. కాగజ్‌నగర్–సిర్పూర్ (టి) ప్రధాన రహదారి పక్కన ఉన్న తుమ్మ చెట్టుకు యువకుడి మృతదేహం వేలాడుతూ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న కాగజ్‌నగర్ రూరల్ ఎస్‌ఐ సందీప్ కుమార్ ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లభించకపోవడంతో అతడి ఆచూకీ, ఇతర వివరాలను గుర్తించేందుకు పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిర్పూర్ టి,ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై గుర్తుతెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సందీప్ కుమార్ తెలిపారు.