BREAKING
బాలికల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత నాయకపుగూడ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా ఇంకా వైసీపీపై విమర్శలా చిన్నారుల చిరునవ్వులే దేశానికి వెలుగులు!!! శిరిడి సాయి స్కూల్ అధినేత ముత్యాలప్ప విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి పుస్తక పఠనమే పునాది రాజన్న ఆలయ విస్తరణ పనులు శరవేగంగా పూర్తి చేయాలి.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరదాల చాటున గిరిజన విద్యార్థుల చదువు కష్టాలు అమరనాథ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన వ్యాపారవేత్త ఈశ్వర్ నాయుడు పంట నష్టాన్ని అంచనా వేసి గుండాల రైతులకు న్యాయం చేయాలి 8వ పీడియాట్రిక్ డయాలసిస్ అండ్ థెరప్యూటిక్ అఫెరిసిస్ మాడ్యూల్ ఫర్ ఎమర్జెన్సీ శిక్షణ కార్యక్రమం కన్నెపల్లిలో ఘనంగా బాల గ్రామ సభ - నెహ్రూ జయంతి వేడుకలు మెడికవర్ ఆసుపత్రిలో ప్రపంచ మధుమేహ దినోత్సవ అవగాహన కార్యక్రమం కౌటాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు భీరం శ్రీధర్ రెడ్డి ఇంటర్నేషనల్ స్కూల్ లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు సింగరేణి గనులను ప్రైవేటుకు అప్పగిస్తే సహించేది లేదు - ఏఐటీయూసీ రాష్ట్ర నాయకుడు వాసిరెడ్డి సీతారామయ్య

చెరువుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి* *నిర్మాణ పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలి.. ఎమ్మెల్యే BLR, చైర్‌పర్సన్ సుధ సూచన* మిర్యాలగూడ అర్బన్, మేజర్ న్యూస్:

Select Suryaa Now
చెరువుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి*  *నిర్మాణ పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలి.. ఎమ్మెల్యే BLR, చైర్‌పర్సన్ సుధ సూచన*  మిర్యాలగూడ అర్బన్, మేజర్ న్యూస్:

*చెరువుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి*

*నిర్మాణ పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలి.. ఎమ్మెల్యే BLR, చైర్‌పర్సన్ సుధ సూచన*

మిర్యాలగూడ అర్బన్, మేజర్ న్యూస్:

మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డు ప్రాంతంలో ఉన్న చిన్న చెరువు కట్ట నిర్మాణ పనులను శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (BLR), మున్సిపల్ చైర్‌పర్సన్ చిలుకూరి సుధ బాలకృష్ణ కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని, నిర్మాణానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపడుతూ, ఎలాంటి జాప్యం లేకుండా వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా చైర్‌పర్సన్ సుధ బాలకృష్ణ మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణంలోని చెరువులను సంరక్షించడం, నీటి వనరులను కాపాడుకోవడం, వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. చెరువులను కేవలం నీటి నిల్వ కేంద్రాలుగానే కాకుండా, పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్ది ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేలా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమన్నారు. చెరువుల పరిరక్షణ ద్వారా భవిష్యత్ తరాలకు నీటి భద్రత కల్పించవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి,ప్రజా ప్రతినిధులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.