చేనేత కార్మికులకు ఉచితంగా కంటి అద్దాల పంపిణీ ఆలేరు,మేజర్ న్యూస్: చేనేత కార్మికుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా 61 మందికి ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేశారు.హ్యాండ్లూమ్ వీవర్స్ కో ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ దాసి శంకర్,వైద్యాధికారి డాక్టర్ హైమావతి చేతుల మీదుగా అద్దాలను అందజేశారు.గతంలో ప్రభుత్వ విప్,ఆలేరు ఎ
చేనేత కార్మికులకు ఉచితంగా కంటి అద్దాల పంపిణీ
ఆలేరు,మేజర్ న్యూస్:
చేనేత కార్మికుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా 61 మందికి ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేశారు.హ్యాండ్లూమ్ వీవర్స్ కో ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ దాసి శంకర్,వైద్యాధికారి డాక్టర్ హైమావతి చేతుల మీదుగా అద్దాలను అందజేశారు.గతంలో ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య,యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ సహకారంతో చేనేత కార్మికుల కోసం చేనేత సహకార సంఘం వద్ద ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు.ఈ శిబిరంలో నమోదు చేసుకున్న కార్మికులకు కంటి పరీక్షలు నిర్వహించగా,అద్దాలు అవసరమైన వారికి తాజాగా ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేశారు.మొత్తం 61 మంది చేనేత కార్మికులు ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందడం జరిగింది.ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి గాడిపల్లి రమేష్,వైస్ చైర్మన్ చింతకింది రంగ,సీహెచ్‌ఓ సత్యవతి,ఏఎన్‌ఎంలు విజయలక్ష్మి,సంతోషిని,ఆశా కార్యకర్తలు రమ,వాణి,ఆరోగ్య సిబ్బంది,చేనేత కార్మికులు పాల్గొన్నారు.