భారీ బతుకమ్మతో అంబరాన్నంటిన సంబరాలు
నవాబుపేట సూర్య న్యూస్: మండలంలోని దాయపంతులపల్లి గ్రామంలో సోమవారం రాత్రి సర్పంచ్ కమలమ్మ కుమార్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళలు వివిధ రకాల రంగురంగుల పూలతో భారీ బతుకమ్మను అందంగా పేర్చి, సంప్రదాయబద్ధంగా ఆటపాటలతో సంబరాలు జరుపుకున్నారు.భారీ బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు.