బెక్కల్ లో ఉచిత వైద్య శిబిరం.....
మద్దూర్ .…మండలంలోని బెక్కల్ గ్రామంలో మెడిసిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో శనివారం మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరాన్ని గ్రామ సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షురాలు నల్లగొప్పుల రేణుక రాములు గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ ప్రజల సంపూర్ణ ఆరోగ్యమే తమ లక్ష్యంగా గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని దీనిని గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు చదివినయోగం చేసుకోవాలని సూచించారు. ఈ వైద్య శిబిరంలో 80 మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించినట్లు మెడిసిటీ వైద్యులు తెలిపారు. నీ వైద్య పరీక్షలలో మెరుగైన వైద్య పరీక్షలు అవసరం ఉన్న వారికి సోమవారం రోజు మెడిసిటి హాస్పిటల్ లో మెరుగైన వైద్యం అందించనున్నట్లు తెలిపారు. అనంతరం వైద్య పరీక్షలు చేయించుకున్న గ్రామస్తులకు గ్రామ సర్పంచ్ మందు గోలీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వార్డు సభ్యులు గ్రామస్తులు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.