బాలల దినోత్సవ వేడుకలు
పెద్దశంకరంపేట;మండలంలోని ఆయా గ్రామపంచాయతీల అధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. కమలాపూర్, రామోజిపల్లి, ఉత్తులూర్,బూర్గుపల్లి తదితర గ్రామాలలో బాలల దినోత్సవం సందర్భంగా మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళర్పించారు. విద్యార్థులకు వివిధ రకాల పోటీలతో పాటు గ్రామసభ బాలలచే నిర్వహింపజేశారు. అనంతరం వారికి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, గ్రామకార్యదర్శులు, అంగన్వాడీటీచర్లు పాల్గొన్నారు.