BREAKING
జిల్లా స్థాయి బాలల సైన్స్ కాంగ్రెస్ లో రాష్ట్ర స్థాయికి ఎంపికైన గీతా విద్యార్థిని పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు నల్ల నర్సింహులు ఎంఐ లండన్ హెడ్ కోచ్ పదవికి కీరన్ పొలార్డ్ గుడ్‌బై: నివేదికల వెల్లడి ఎలక్టోరల్ లిటరసీ క్లబ్‌ల ఆధ్వర్యంలో వ్యాస, క్విజ్ పోటీలు.రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష అయ్యప్ప పూజలో పాల్గొన్న బీఆర్‌ఎస్‌ నేతలు భూభారతి రీ-సర్వే పకడ్బందీగా నిర్వహించాలి. కలెక్టర్ కె. హైమావతి తెలంగాణ ఇన్నోవేషన్ స్టార్టప్ ఛాలెంజ్ (TISC) ప్రారంభం: ఆవిష్కర్తలకు తెలంగాణ ప్రభుత్వం పిలుపు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ తుషార్ డూడి గోకుల్ డెయిరీ వివాదంపై రాహుల్ గాంధీకి సీఎం ఫడ్నవీస్ కౌంటర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలి పర్చూరు నియోజకవర్గంలో మండలాల వారీగా పోలింగ్ శాతం ఇలా నిరసన వ్యక్తం చేస్తున్న ఓటర్లు తిరుమలలో డిసెంబర్ 20 నుంచి 29 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలి:పట్టభద్రులకు కాంగ్రెస్ నాయకుడు చిన్నయ్య పిలుపు

అయ్యప్ప పూజలో పాల్గొన్న బీఆర్‌ఎస్‌ నేతలు

Select Suryaa Now
అయ్యప్ప పూజలో పాల్గొన్న బీఆర్‌ఎస్‌ నేతలు

 దుండిగల్ మేజర్ న్యూస్ :    మేడ్చల్ జిల్లా బీఆర్‌ఎస్‌ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు నివాసంలో గురువారం నిర్వహించిన అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ ఎల్పీ విప్ కేపీ.వివేకానంద్ ముఖ్య అతిథులుగా హాజరై అయ్యప్ప స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి కుటుంబం సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని నేతలు ఆకాంక్షించారు. అనంతరం పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులతో కలిసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అయ్యప్ప పూజా కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొన్నారు. భక్తులు స్వామివారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్‌లను శంబీపూర్ రాజు సాదరంగా ఆహ్వానించి పూజా కార్యక్రమంలో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. నాయకులు పరస్పరం ఆధ్యాత్మిక, సామాజిక అంశాలపై చర్చించుకున్నారు. కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు