అయ్యప్ప దర్శనంతో విజయవంతమైన మహా పాదయాత్ర
కందుకూరు, మేజర్ న్యూస్: కందుకూరు మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన సాతూరి నవీన్ కుమార్ అయ్యప్ప స్వామి మాలధారణ చేసి, షాద్‌నగర్ నుంచి శబరిమల వరకు శ్రీ కలియుగ వరదన్ శబరిమల మహా పాదయాత్ర బృందంతో పాదయాత్ర చేపట్టి విజయవంతంగా అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నారు.
మండే ఎండలు, కురిసే వానలు, మార్గమధ్యంలో ఎదురైన ఎన్నో ఇబ్బందులను భరిస్తూ, అయ్యప్ప నామస్మరణతో భక్తిశ్రద్ధలతో యాత్ర కొనసాగించారు. స్వామిపై నమ్మకం, గురుస్వాముల ఆశీస్సులతో ఎన్ని కష్టాలు ఎదురైనా వెనుకడుగు వేయకుండా పాదయాత్ర పూర్తి చేసి స్వామివారి దివ్య దర్శనం పొందారు. ఈ పవిత్ర యాత్ర తన జీవితంలో మరచిపోలేని ఆధ్యాత్మిక అనుభూతిగా నిలిచిందని నవీన్ కుమార్ పేర్కొన్నారు.
టి శ్రీనివాస్, మేజర్ న్యూస్, కందుకూర్, రంగారెడ్డి జిల్లా.