అరుణాచల గిరిప్రదక్షిణకు నాగర్‌కర్నూల్ నుంచి ప్రత్యేక బస్సు -నాగర్ కర్నూల్ డిపో మేనేజర్ యాదయ్య
నాగర్‌కర్నూల్ క్రైమ్, సూర్య న్యూస్: అరుణాచలంలో నిర్వహించే పవిత్ర గిరిప్రదక్షిణకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం నాగర్‌కర్నూల్ ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును నడపనున్నట్లు డిపో మేనేజర్ యాదయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 23న సాయంత్రం 7 గంటలకు నాగర్‌కర్నూల్ బస్టాండ్ నుంచి బస్సు బయలుదేరనుంధని యాత్రలో భాగంగా మార్గమధ్యంలో కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం, వెల్లూరులోని గోల్డెన్ టెంపుల్‌ను భక్తులు దర్శించుకునేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 24న రాత్రికి అరుణాచలం చేరుకోనున్న బస్సు, 25వ తేదీ ఆదివారం పౌర్ణమి సందర్భంగా నిర్వహించే గిరిప్రదక్షిణ అనంతరం సాయంత్రం తిరుగు ప్రయాణమవుతుందని ,26 న ఉదయం నాగర్‌కర్నూల్‌కు చేరుకుంటుందనీ తెలిపారు
యాత్రకు పెద్దలకు రూ.3,600, పిల్లలకు రూ.2,400 టికెట్ ధరగా నిర్ణయించారని, ముందస్తు రిజర్వేషన్ కోసం 98850 42895, 94904 11591, 96404 23165 నంబర్లలో సంప్రదించాలని డిపో మేనేజర్ సూచించారు.