అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చిన గాయత్రీ మాత
ఘట్‌కేసర్ రూరల్, మేజర్ న్యూస్ : మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఘట్‌కేసర్ సర్కిల్ పోచారం డివిజన్ పరిధిలోని అన్నోజిగూడ గాయత్రీ మాత ఆలయంలో శనివారం అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా గణపతి పూజ, లక్ష్మీగణపతి పూజ, నవగ్రహ సహిత నవచండీ హోమం, నిత్య కుంకుమార్చన నిర్వహించారు. భక్తుల రాకతో ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అనంతరం పావులూరి నారాయణరెడ్డి, వనజ, వినోద్, రాజేష్, లోకేష్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయం ట్రస్ట్ బోర్డ్ సభ్యులు, మాజీ మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండల్‌రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ రెడ్డియా నాయక్, రాష్ట్ర గిరిజన నాయకుడు జితేందర్ నాయక్, సూర్య యూత్ అధ్యక్షుడు బోయపల్లి రాజేశ్వర్‌రెడ్డి, నాయకులు ఎట్టల్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, మురళి, పాశం లక్ష్మణ్ యాదవ్, సంతోష్ నాయక్, వినయ్‌రెడ్డి, రామనందం, శ్రీకాంత్, శివ, ప్రశాంత్, కార్తిక్ పంతులు, కౌశిక్ పంతులు, రామ్మూర్తి పంతులు, ప్రసాద్ పంతులు, వేణుగోపాల్ పంతులు, వినీల్, కౌశల్, నవనీత్ తదితరులు, భక్తులు పాల్గొన్నారు.