BREAKING
దివ్య కుటుంబానికి అండగా ఉంగుటూరు ఎమ్మెల్యే, జనసేన నాయకులు యాదవోలులో కేంద్ర బృందం పర్యటన ఘనముగా గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం ఆర్థిక ప్రమాదాలను నివారించడానికి క్రమమైన వడ్డీ రేట్ల పెంపే ఉత్తమం జెన్సన్ హువాంగ్ లేకపోతే కీలక ఒప్పందాలను కోల్పోనున్న ఎన్విడియా 73 ఏళ్ల నిరీక్షనకు తెరదించుతూ న్యూజిలాండ్‌పై అద్భుత విజయం సాధించిన వేల్స్ జాతీయ రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి అమెరికాలో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం 1998 తర్వాత తొలిసారిగా అలాస్కాలో గెలుపొందిన డెమొక్రాటిక్ గవర్నర్ స్పేస్‌ఎక్స్ ఇంటర్నెట్ స్పీడ్ పరిమితులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్ర ఆగ్రహం జిల్లా ఆసుపత్రిలో డబ్బులు అడిగితే ఫోన్ చేయండి – ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కొండ శ్రీధర్ నశా ముక్త్ భారత్ బ్లాక్ స్థాయి క్రీడలు విజయవంతం న్యాయవాద పరిషత్‌ జిల్లా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక. మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్త సేవల అంతరాయంపై ట్రంప్ అధికారి వ్యంగ్యాస్త్రాలు: H-1B వీసా నియామకాలను ప్రస్తావిస్తూ విమర్శ నిరుద్యోగ మహిళలకు భరోసా -ఈ నెల 22న పెద్దపల్లిలో మహిళ ‘మెగా జాబ్ మేళా’

*అంతర్జాతీయ భారత్ సమ్మిట్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే సంజీవరెడ్డి*

Select Suryaa Now
*అంతర్జాతీయ భారత్ సమ్మిట్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే సంజీవరెడ్డి*

నారాయణఖేడ్;హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక అంతర్జాతీయ భారత్ సమ్మిట్–2026 కార్యక్రమంలో శనివారం నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, విధాన రూపకర్తలు, ఆర్థికవేత్తలు, విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, మేధావులు పాల్గొంటున్న ఈ అంతర్జాతీయ సదస్సు తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలుస్తోంది. సుమారు 70 దేశాల నుంచి వెయ్యి మందికి పైగా ప్రతినిధులు పాల్గొంటున్న ఈ సమ్మిట్‌లో ప్రపంచ రాజకీయ పరిణామాలు, ప్రజాస్వామ్య పరిరక్షణ, ఆర్థిక అభివృద్ధి, సామాజిక న్యాయం, పెట్టుబడుల అవకాశాలు, పర్యావరణ పరిరక్షణ, అంతర్జాతీయ సహకారం వంటి కీలక అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. ఈ సమ్మిట్ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అపారమైన పారిశ్రామిక, ఐటీ, వ్యవసాయ, విద్యా, వైద్య రంగాల సామర్థ్యాలను ప్రపంచ దేశాలకు పరిచయం చేయడంతో పాటు రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలు, యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు మార్గం సుగమం కానుంది. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి, పెట్టుబడులు, పారిశ్రామిక రంగాలకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి ఈ సమ్మిట్ మరింత గుర్తింపు తీసుకురానుంది. ప్రపంచ దేశాల ప్రతినిధులు ఒకే వేదికపై సమావేశమై భవిష్యత్ అభివృద్ధి దిశగా ఆలోచనలు, అనుభవాలు పంచుకోవడం ఎంతో ప్రాధాన్యత కలిగిన అంశమని, ఇలాంటి అంతర్జాతీయ సదస్సులు తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను మరింత పెంచుతాయని ఈ సందర్భంగా పేర్కొనవచ్చు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రులు భారతదేశానికి చెందిన రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు