BREAKING
పల్స్ పోలియో - మన పిల్లల భవిష్యత్తుకు రక్షణ టెలికం బోర్డు మెంబర్ బీజేపీ జిల్లా నాయకులు బైండ్ల కుమార్ పేకాట స్థావరంపై పోలీసుల దాడి నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే.. రెండు చుక్కలు జీవితానికి రక్షణ: సర్పంచ్ మేఘనాథ్ రెడ్డి నిరుపేదలకు ఆరోగ్య భరోసా కల్పించడమే లక్ష్యం లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పల్స్ పోలియో చుక్కలు వేయించాలి: సర్పంచ్ బొక్క సువర్ణ అంజిరెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు...గుత్తుల సాయి… ఎన్విడియాకు మరో భారీ షాక్: జెన్సెన్ హువాంగ్ నిష్క్రమణ తర్వాత అకౌంటింగ్ అవకతవకలపై యూఎస్ ఎస్‌ఈసీ దర్యాప్తు! రాచులూర్ లో పల్స్ పోలియో కార్యక్రమం డీసీసీ అధ్యక్షుడిగా ధారాసింగ్ నాయక్‌కు ఏడాది పూర్తి.. పెద్దేముల్ మండల కాంగ్రెస్ నేతల శుభాకాంక్షలు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి ఎన్.నగరం సర్పంచ్ బరిలో లక్ష్మీదేవమ్మ, గాయత్రి ఎంపీడీవో కార్యాలయంలో వేర్వేరుగా నామినేషన్ల దాఖలు తరలివచ్చిన గ్రామస్థులు, మద్దతుదారులు.. సందడిగా మారిన పరిసరాలు రావల్ కోల్‌లో ఓవర్‌లోడ్ వాహనాల బీభత్సం.. ప్రజల ప్రాణాలతో చెలగాటం పుట్టపర్తికి చేరుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్ చైనా ఏఐ స్టాక్స్‌లో 1.7 ట్రిలియన్ డాలర్ల భారీ పతనం: ఒకప్పటి హాట్ ట్రేడ్ కాస్తా మదుపర్లకు నష్టాల ఊబిగా మారిన వైనం!

అమృత్ భారత్ పనులు వేగవంతం చేయాలి: డీఆర్‌ఎం డా. గోపాలకృష్ణ

Select Suryaa Now
అమృత్ భారత్ పనులు వేగవంతం చేయాలి: డీఆర్‌ఎం డా. గోపాలకృష్ణ

అమృత్ భారత్ పనులు వేగవంతం చేయాలి: డీఆర్‌ఎం డా. గోపాలకృష్ణ
మిర్యాలగూడ అర్బన్ ,మేజర్ న్యూస్ సెప్టెంబర్ : అమృత్ భారత్ పథకం కింద చేపడుతున్న రైల్వే స్టేషన్ ఆధునికీకరణ, అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్‌ఎం) డాక్టర్ గోపాలకృష్ణ అధికారులను ఆదేశించారు.
గురువారం మిర్యాలగూడ రైల్వే స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన, నిర్మాణంలో ఉన్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. స్టేషన్‌లో ప్రయాణికులకు అందిస్తున్న సౌకర్యాలు, జరుగుతున్న పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా రెండో నంబర్ ప్లాట్‌ఫామ్‌పై ఏర్పాటు చేసిన సిగ్నల్ ఫోన్లు పనిచేయకపోవడాన్ని గమనించిన డీఆర్‌ఎం, వాటిని తక్షణమే మరమ్మతు చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. అలాగే గూడ్స్ షెడ్‌లో సౌకర్యాలను మెరుగుపరచాలని, అవసరమైతే అదనపు నిర్మాణాలు చేపట్టాలని సూచించారు.
నడికుడి–బీబీనగర్ డబుల్ లైన్ నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని గుత్తేదారులకు స్పష్టం చేశారు. ఈ తనిఖీలో రైల్వే వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.