BREAKING
పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం కొండపల్కలలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా సీఎం, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు... అండర్-16 జిల్లా క్రికెట్ జట్టుకు 15 మంది క్రీడాకారుల ఎంపిక సీతారామ భద్ర క్షేత్ర నిర్మాణానికి సొసైటీ చైర్మన్ విరాళం వికసించని కమలం.. పగిలిన గ్లాసు మెరుగైన వైద్య చికిత్సకు రూ.2 లక్షల ఎల్ఓసీ మంజూరు చేయించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పెద్దకల్వలలో ఘనంగా సీఎం, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు మా ప్రభుత్వ శక్తి మహిళా శక్తే.. 2034 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీయే లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు దేశవ్యాప్తంగా ఆహార కల్తీపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కొరడా: ₹81.8 కోట్ల సరుకు సీజ్ సింగారంలో ఘనంగా మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు అల్ఫోర్స్ డాక్టర్ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు లక్నో వెళ్లే ఇండిగో విమానానికి హైజాక్ బెదిరింపు: బెంగళూరుకు వాపస్ భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి సంబరాలు

అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా శ్రీ మహాలక్ష్మి మాత పూజలు - హోమం & దీపావళి వేడుకలు

Select Suryaa Now
అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా శ్రీ మహాలక్ష్మి మాత పూజలు - హోమం & దీపావళి వేడుకలు

 సూర్య కరీంనగర్: భారతదేశంతో పాటు విదేశాల్లోనూ దీపావళి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారని, శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించిన వారికి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి అన్నారు.

స్థానిక కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో తన కుటుంబ సభ్యులతో కలిసి నిర్వహించిన దీపావళి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదమంత్రోచ్ఛారణల నడుమ శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఫల పంచామృతాభిషేకం, వివిధ రకాల ద్రవ్యాలు, పండ్ల రసాలు, పుష్పాలతో విశేష అభిషేక కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.

అనంతరం డాక్టర్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ దీపావళి అనగానే దీపాలు, టపాసులు గుర్తుకొస్తాయని, తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలను కొనసాగిస్తూ భక్తిశ్రద్ధలతో పండుగను జరుపుకోవడం ఆనందదాయకమన్నారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ పర్యావరణహితంగా దీపావళి జరుపుకోవాలని సూచించారు.

వేడుకల్లో భాగంగా గోపూజ, గురువందనం, గణపతి పూజ, పుణ్యాహవాచనం, నవగ్రహ పూజ, శ్రీ లక్ష్మీ పూజ, లక్ష్మీ హోమం, శ్రీ మహాలక్ష్మి యాగం నిర్వహించారు. అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించి, పండ్లు, సిరా, పాయసం తదితర నైవేద్యాలను సమర్పించారు. యాగంలో కీలకమైన పూర్ణాహుతి కార్యక్రమాన్ని వేదమంత్రాల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించారు.

పూలతో అలంకరించిన పాఠశాల ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది. కార్యక్రమం అనంతరం వేద పండితులు డాక్టర్ నరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు.

ఈ వేడుకల్లో వివిధ పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, సిబ్బంది, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.