ఐదేళ్లలోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలి
కోహిర్ ; ఈ నెల 22వ తేదీ ఆదివారం నిర్వహించే జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా బిలాల్‌పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ దివ్య జ్యోతి ఆమె మాట్లాడుతూ ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది.పీహెచ్‌సీ పరిధిలో మొత్తం 24 పోలియో బూత్‌లను ఏర్పాటు చేయడంతో పాటు రైల్వే స్టేషన్ వద్ద ఒక ట్రాన్సిట్ బూత్, రెండు రూట్ల ద్వారా చిన్నారులకు పోలియో చుక్కలు వేయడానికి ఏర్పాట్లు చేశారు.పీహెచ్‌సీ పరిధిలో మొత్తం 2,604 మంది ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఆదివారం పోలియో బూత్‌ల వద్ద చిన్నారులకు చుక్కలు వేయనుండగా, అక్కడికి రాలేకపోయిన చిన్నారుల కోసం సోమ, మంగళవారాల్లో ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి పోలియో చుక్కలు వేయనున్నారు.ఐదేళ్లలోపు చిన్నారుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది.