BREAKING
అల్లు అర్జున్ డైరెక్టర్‌తో హీరోగా ఎంట్రీ ఇస్తున్న దళపతి విజయ్ కొడుకు.. నెట్టింట వైరల్ అవుతున్న వార్త ప్రియాంక చోప్రా కోసం టూర్ షెడ్యూల్ మార్చుకున్న నిక్ జోనాస్.. అరుదైన రీతిలో కల్వా చౌత్ వేడుకలు బాలీవుడ్‌లో నాకంటూ సరైన స్థానం లేదు.. చిత్ర పరిశ్రమకు దూరంగా ఉండటమే మేలంటున్న దర్శకుడు అమోల్ గుప్తే చారిత్రాత్మక శతకంతో రికార్డుల వేట సాగించిన ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు.. ఇంకా వంద ముప్పై ఎనిమిది పరుగుల వెనుకంజలో వెస్టిండీస్ తిరుపతిలో కూటమి హవా - ప్రచారంలో దూసుకుపోతున్న మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ సౌతాఫ్రికాతో మూడో టెస్టులో కీలక ఆధిక్యం సాధించిన ఆస్ట్రేలియా సెంచరీతో చెలరేగిన బెన్ డకెట్.. శ్రీలంక ముందు భారీ లక్ష్యాన్ని ఉంచిన ఇంగ్లండ్ కంబదూరులో రాజకీయ వేడి... జనసేన జడ్పిటిసి అభ్యర్థికి టిడిపి పూర్తి మద్దతు. ప్రజా సమస్యలను పరిష్కరించడమే నా ద్వేయం.. 16వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఆర్. నాగభూషణం కటారి హేమలతను అత్యధిక మెజారిటీతో గెలిపించండి ఫైనాన్స్ ఆఫీసర్ గా సర్దార్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఐర్లాండ్ లెగ్ స్పిన్నర్ బెన్ వైట్ శ్రీరామలో మహిళల చెస్ క్రీడాకారుల ఎంపికలు టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అరుదైన రికార్డుకు అడుగు దూరంలో

అభివృద్ధిని చూసి ఓర్వలేకే కాంగ్రెస్ నేతలపై బీజేపీ తప్పుడు ఆరోపణలు

Select Suryaa Now
అభివృద్ధిని చూసి ఓర్వలేకే కాంగ్రెస్ నేతలపై బీజేపీ తప్పుడు ఆరోపణలు
సూర్య, మందమర్రి.  చెన్నూరు, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేకే మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణలపై బీజేపీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తూ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని డీసీసీ అధ్యక్షుడు రఘునాథరెడ్డి విమర్శించారు. అభివృద్ధికి సహకరించాల్సిన ప్రతిపక్ష నాయకులు అసత్య ప్రచారాలకు దిగడం సరికాదన్నారు. గురువారం మందమర్రి ప్రెస్ క్లబ్‌లో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మంద తిరుమల్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
 
ప్రజాస్వామ్య పరిరక్షణకు ఢిల్లీలో పోరాటం
 
ఎన్నికల కమిషన్ స్వయంప్రతిపత్తిని కాపాడటంతో పాటు ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించాలనే లక్ష్యంతో నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిర్వహించనున్న ధర్నాలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొననున్నట్లు రఘునాథరెడ్డి తెలిపారు. మంచిర్యాల జిల్లా నుంచి పట్టణ, మండల అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు కలిపి సుమారు 500 మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు తదితరులు పాల్గొననున్నారని పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్ నియామక ప్రక్రియలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి స్థానం కల్పించే నిబంధనను పక్కనపెట్టి కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోందన్నారు. ప్రధానమంత్రి, లోక్‌సభ ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా ఉండే విధానానికి భిన్నంగా నియామక కమిటీని ఏర్పాటు చేయడాన్ని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు.
 
అర్హులైన ఓటర్లను తొలగించే ప్రయత్నం
 
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోతున్నాయనే ఆందోళనతోనే కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు చేపడుతోందని రఘునాథరెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకును తగ్గించాలనే ఉద్దేశంతోనే బీజేపీ ప్రభుత్వం ఈ ప్రక్రియను తీసుకొచ్చిందని ఆరోపించారు. ఓటర్ల హక్కులను కాపాడేందుకు కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలు నిరసనలు చేపడితే బీజేపీ నాయకులు విమర్శించడం సరికాదన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధికి కృషి చేసిన స్వర్గీయ కాకా వెంకటస్వామి కుటుంబంపై విమర్శలు చేసే ముందు బీజేపీ నాయకులు వాస్తవాలను తెలుసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యాన్ని, ఓటు హక్కును పరిరక్షించేందుకు కాంగ్రెస్ చేపడుతున్న పోరాటం నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు. నవంబర్ 1న ఢిల్లీలో జరిగే ధర్నాను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.