ఆరూర్ గ్రామంలో బతుకమ్మ పండుగకు జోరుగా ఏర్పాట్లు
సదాశివపేట;సదాశివపేట మండలం ఆరూర్ గ్రామంలో ఆదివారం జరగనున్న బతుకమ్మ పండుగ నిర్వహణకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. గ్రామ సర్పంచ్ నాయికోటి లావణ్య మధు ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు, గ్రామస్తులు కలిసి ఉత్సాహంగా జరుపుకునేలా ఏర్పాట్లు చేపడుతున్నారు. పండుగ సందర్భంగా గ్రామంలో సందడి వాతావరణం నెలకొననుంది. బతుకమ్మ వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లపై దృష్టి సారిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ విట్టల్,కార్యదర్శి మల్లేష్ గౌడ్,వార్డు సభ్యులు పాల్గొన్నారు.