BREAKING
బతుకమ్మ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక: వివేకానంద నగర్‌లో వేడుకల్లో పాల్గొన్న టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్‌! కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి బండి దీప్తి ఇంటి పై దాడి అల్లాపూర్‌ డివిజన్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ" సంబురాలు లక్ష్మణ్‌గౌడ్‌కు ప్రజల ఆధరణ, అభిమానం ఉంది బతుకమ్మ వేడుకల్లో బండి రమేష్‌ అల్లాపూర్‌ డివిజన్‌లో బతుకమ్మ సంబురాలు మాజీ కార్పొరేటర్‌ సబిహాగౌసుద్దీన్‌ అల్లాపూర్‌ దుర్గామాత మండపాల్లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రత్యేక పూజలు! చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర కార్యక్రమం... ప్రారంభించిన పిసిసి చీఫ్ జాతీయ బాండీ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టు సత్తా రన్నరప్‌గా నిలిచిన తెలంగాణ.. మూడు స్వర్ణాలు, ఒక రజత పతకం కైవసం యూసఫ్‌గూడలో ఘనంగా బతుకమ్మ వేడుకలు హంస ఆకారంలో 18 అడుగుల భారీ బతుకమ్మ ఏర్పాటు శరన్నవరాత్రుల్లో భాగంగా ముగ్గుల పోటీల నిర్వహణ ఎండ వెలుతురు.. పౌష్టికాహారం.. ఆటపాటలతో పిల్లల ఎముకలకు బలం! మైనంపల్లి గెస్ట్ హౌస్‌లో వైభవంగా మైసమ్మ తల్లి తెప్పోత్సవం: హాజరైన మల్కాజిగిరి కాంగ్రెస్ ముఖ్య నేతలు! విజయదశమి స్ఫూర్తితో ఎల్లంపేట అభివృద్ధికి కృషి చేస్తాం.. ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలి ఎల్లంపేట మున్సిపల్ చైర్మన్ లావుడియా శ్రీదేవి రమేష్ ప్రజలకు పీఏసీ చైర్మన్ ,ఎమ్మెల్యే గాంధీ దసరా శుభాకాంక్షలు దసరా శుభాకాంక్షలు తెలిపిన రాగం నాగేందర్ యాదవ్ దసరా శుభాకాంక్షలు తెలిపిన మాజీ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ దంపతులు

ఆర్చరీ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 చాంపియ‌న్‌ మైటీ మరాఠాస్ ఫైనల్లో 6-2తో కాకతీయ నైట్స్‌పై గెలుపు ఉత్త‌మ రిక్వ‌ర్ ఆర్చ‌ర్ గా బొమ్మదేవర ధీరజ్

Select Suryaa Now
ఆర్చరీ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 చాంపియ‌న్‌ మైటీ మరాఠాస్  ఫైనల్లో  6-2తో కాకతీయ నైట్స్‌పై గెలుపు  ఉత్త‌మ రిక్వ‌ర్ ఆర్చ‌ర్ గా బొమ్మదేవర ధీరజ్

తెలంగాణ బ్యూరో ప్రతినిధి :  ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్‌) రెండో సీజన్ లో మైటీ మరాఠాస్ జట్టు అంచనాలను తలకిందులు చేస్తూ చాంపియన్‌గా అవతరించింది.  హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజా వేదికగా ఆదివారం  ఉత్కంఠభరితంగా సాగిన  ఫైనల్లో కాకతీయ నైట్స్‌తో తలపడిన మరాఠాస్.. తొలి క్వాలిఫయర్‌లో ఆ జ‌ట్టు చేతిలో  ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటూ 6-2 తేడాతో ఘన విజయం సాధించింది. భారత రికర్వ్ స్టార్ బొమ్మదేవర ధీర‌జ్‌ ఇన్నర్ ఎక్స్-రింగ్‌లోకి బాణాన్ని సంధించి విజయాన్ని పూర్తి చేయగా, 'మిస్టర్ పర్ఫెక్ట్' మైక్ ష్లోస‌ర్‌ అసాధారణ ప్రదర్శన కనబరిచాడు. ఫైనల్లో ధీర‌జ్ 80కి 79 పాయింట్లు సాధించగా, మైక్ ష్లోస‌ర్ 80కి 80 పాయింట్లు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
వ్యూహాత్మక మార్పులతో ఫలించిన ప్రణాళిక:
మరాఠాస్ మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయాలు జట్టు విజయంలో ప్రధాన భూమిక పోషించాయి. అమన్ సైనీ స్థానంలో బరిలోకి దిగిన మైక్ ష్లోస‌ర్‌ రెండో ఎలిమినేటర్‌లో 79 పాయింట్లు, ఫైనల్లో ప‌ర్ఫెక్ట్‌ 80 పాయింట్లు సాధించాడు. అలాగే అలెజాండ్రా వాలెన్సియా స్థానంలో బరిలోకి దిగిన సిమ్రాన్‌జిత్ కౌర్ ఒత్తిడి సమయాల్లో రాణించి జట్టును గెలిపించింది. ఫైనల్‌లో తొలి సెట్ 75-75తో టై కాగా, రెండో సెట్‌లో ధీర‌జ్ రెండు ఇన్నర్-10లు కొట్టి ఆధిక్యాన్ని అందించాడు. మూడో సెట్ కూడా టై అయింది. నిర్ణయాత్మక నాలుగో సెట్‌లో నైట్స్ ఆటగాళ్లు (నికో వీనర్, జ్యోతి సురేఖ, ఎలియా కనాల్స్, నీరజ్ చౌహాన్) తీవ్ర ఒత్తిడికి లోనై 9 పాయింట్లకే పరిమితం కాగా, మరాఠాస్ 79 పాయింట్లు సాధించి టైటిల్‌ను సొంతం చేసుకుంది.
అద్భుత పున‌రాగ‌మ‌నం:
శ‌నివారం జ‌రిగిన లీగ్ దశ చివరి మ్యాచ్‌తో పాటు ఆదివారం జ‌రిగిన‌ తొలి క్వాలిఫయర్‌లో షూటాఫ్ లో 2-0 (4-4)తో మరాఠాస్‌ను ఓడించిన కాకతీయ నైట్స్ ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. తొలి క్వాలిఫయర్‌లో ఓడిన మరాఠాస్ పట్టువదలకుండా రెండో ఎలిమినేటర్‌లో పృథ్వీరాజ్ యోధాస్‌ను 5-3 తేడాతో ఓడించి ఫైనల్‌లో అడుగుపెట్టిన మరాఠాస్.. తుదిపోరులో సత్తా చాటింది. మ్యాచ్ అనంతరం ధీర‌జ్ మాట్లాడుతూ, "ఒకరిపై ఒకరం నమ్మకం ఉంచడం, ఓపిక పట్టడం, నిరంతరం దాడి చేయడమే మా విజయానికి కారణం" అని స్పష్టం చేశాడు. తొలి మ్యాచ్‌లో ఓడిన తర్వాత తమ వ్యూహంలో ఎలాంటి మార్పు చేయలేదని, అదే ఈ జట్టు ప్రత్యేకత అని ధీర‌జ్ వివరించాడు. ఈ అద్భుత ప్రదర్శనతో ధీర‌జ్ టోర్నమెంట్ ఉత్తమ రికర్వ్ పురుష ఆర్చర్‌గా నిలిచాడు.
టోర్న‌మెంట్‌ ఉత్తమ ఆర్చర్లు :
రికర్వ్ పురుషులు: ధీరజ్ బొమ్మదేవర (మరాఠాస్)
రికర్వ్ మహిళలు: సంగీత (రాజ్‌పుతానా రాయల్స్)
కాంపౌండ్ పురుషులు: మథియాస్ ఫుల్లర్టన్ (చేరో )
కాంపౌండ్ మహిళలు: అలెజాండ్రా ఉస్కియానో (చోళ‌)