BREAKING
గురువే సమాజ ప్రగతికి పునాది 'ఫీల్ గుడ్' చిత్రం నుండి యూత్‌ఫుల్ మెలోడీ 'మమ్మా మియా' పాట విడుదల జాబ్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ 125 రోజులు పని పొందాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా శివపూర్ గ్రామంలో ఘనంగా వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం - చైర్మన్ నాగం గంగారం మూడు నామినేషన్లు తిరస్కరణ రోడ్డు ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించడంలో పీఎం రాహత్ పథకం కీలక పాత్ర పోషిస్తుంది : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మృత సర్పంచ్ కుటుంబానికి అండగా ఉంటా: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పరిషత్తు పోరు"నామినేషన్" సక్రమం...ఇక అసలైన సమరం! కీర్తి సురేష్, రాధికా ఆప్టేల ‘అక్క’ ట్రైలర్ విడుదల: అక్టోబర్ 30న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల విద్యార్థులు మాదాకద్రవ్యాలకు దూరంగా ఉండాలి అగ్రిగోల్డ్ బాధితుల నుండి బాండ్లు సేకరణ.. * పోలీస్ బ్యారెక్స్ కళ్యాణ మండపం వద్ద బారులు తీరిన బాధితులు * వర్షాభావ పరిస్థితుల వల్ల వరి పంటకు తెగుళ్లు - ఏ డి ఏ అపర్ణ # చీరాలలో ఎమ్మెల్యే కొండయ్య సమక్షంలో టీడీపీలో చేరిన దేవాంగపురి యువకులు ఇసుక కొండ సత్యనారాయణ స్వామి ఆలయంలో ఆశ్వీయుజ పౌర్ణమి పూజలు సబ్సిడీ శనగ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి - అదనపు కలెక్టర్ వై వి గిరి

ఆదివాసి పేదలపై అటవీ అధికారుల దాడులు ఆపాలి.

Select Suryaa Now
ఆదివాసి పేదలపై అటవీ అధికారుల దాడులు ఆపాలి.

• టైగర్ జోన్ ను రద్దు చేయాలి 

• ఆదివాసి గ్రామలల్లో అభివృద్ధి పనులు చేపట్టాలి 

సూర్య, లక్షెట్టిపేట/మంచిర్యాల జిల్లా ప్రతినిధి :

  పట్టణంలో శనివారం రోజున స్థానిక విశ్రాంతి భవనంలో టైగర్ జోన్ బాధితుల పోరాట వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, సామాజిక సంఘాల నాయకులు హాజరై మాట్లాడుతూ... కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అటవీ హక్కుల చట్టం అమలు చేయకుండా ఆదివాసి పేదలను టైగర్ జోన్ పేర్లతో పులుల సంరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం అంటూ ఆదివాసి గ్రామాలను ఖాళీ చేయించే కుట్ర పన్నుతున్నది. అంతేకాకుండా గిరిజన గ్రామాలలో కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. అడవిపై ఆధారపడ్డ ఆదివాసిలు, పేదలు ఉపాధి కోసం అడవిలోకి వెళ్ళనివ్వకుండా అటవీ అధికారులు ఆంక్షలు పెట్టడం సరైంది కాదన్నారు. జిల్లాలో పట్టుపురుగుల పెంపకం చేపట్టిన ఆదివాసి పేద రైతుల పంటలను నిర్ధాక్షణంగా అటవీ అధికారులు ధ్వంసం చేశారు. పశువులను మేకలను అడవిలో మేపుతున్న మేకల కాపర్లపై దాడి చేసిన అటవీశాఖ అధికారులు, ఇలా ఆదివాసి పేదలపై అనునిత్యం అటవీ శాఖ అధికారులు ఆంక్షలు పెట్టడం , నిర్బంధం మోపడం , దాడులు చేయడం ఆపాలన్నారు. ఆదివాసిలు పేదలు సాగు చేసుకుంటున్నా పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలన్నారు. ప్రతి ఆదివాసీ గ్రామాలలో ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నారు, విద్య వైద్య ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. ఈ సమావేశంలో సూర్పటేల్ , చిత్రు, కిష్ఠు, దుంపల రంజిత్ కుమార్, కనికరపు అశోక్, రెడ్దిమల్ల ప్రకాష్, ధమ్మా నారాయణ, మలేం చిన్నన్న, అవునూరి వెంకటేష్, ముల్కల్లా రాందాస్, సుధాకర్, గరిసే రవీందర్, తోగారి రాజు, భైరం లింగన్న, సత్తన్న, కళ్యాణం రవి, తదితరులు పాల్గొన్నారు.