BREAKING
కోహిర్ మండల ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు టి. సువర్ణ మల్లన్న ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్ రేఖ వెంకట్ రెడ్డి *జిల్లా కలెక్టర్‌ను కలిసి విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సంగారెడ్డి ఎమ్మెల్యే కాంటెస్టెడ్ అభ్యర్థి పులిమామిడి రాజు* *జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శెట్కర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నాయకులు* 27వ వార్డులో '' ఇంటింటికి ..... టీడీపీ''...! అందోల్ నియోజకవర్గం ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి దామోదర్ రాజనర్సింహ అనంతపురం మేయర్‌గా కాంగ్రెస్ విజయం ఖాయం: శాలి దాదా గాంధీ కాంగ్రెస్ పార్టీ కడప మేయర్ అభ్యర్థిగా నగర అధ్యక్షుడు సయ్యద్ గౌస్ పీర్ సతీమణి ప్రొద్దుటూరులో ప్రజాస్వామ్యానికి విఘాతం.. నామినేషన్ పరిశీలనకు వెళ్లకుండా అడ్డుకున్న టీడీపీ శ్రేణులు మహిషాసుర మర్దినిగా దర్శనమిచ్చిన అమ్మవారు లొద్దిపల్లెలో వైభవంగా బోనాల సమర్పణ సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు వజ్రేష్‌ యాదవ్‌కు వినోద్ కుమార్ జన్మదిన శుభాకాంక్షలు శ్రీ ముమ్మదేవి అమ్మవారి కి దర్శించుకున్న ఏఎంసి చైర్మన్ సుధాకర్ రెడ్డి చింతల్‌గట్టు గ్రామ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్ బంటు విద్యాసాగర్ కళ్యాణదుర్గం మున్సిపాలిటీ చైర్ పర్సన్ పదవికి 11 నామినేషన్లు చెల్లుబాటు.

5,400 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపెందుకు ప్రభుత్వం కుట్ర.

Select Suryaa Now
5,400 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపెందుకు ప్రభుత్వం కుట్ర.

 

దుబారా ఖర్చుతో ప్రజా ధనాన్ని దుర్వినియోగపరుస్తున్న మంత్రులు.


రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్ఎస్  అభ్యర్థి గెలుపు ఖాయం.

 మాజీ శాసనసభ్యులు  బొల్లం మల్లయ్య యాదవ్ .

 

కోదాడ (మేజర్ న్యూస్)ఈఆర్సీ  ద్వారా సుమారు 5,400 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని బలవంతంగా ప్రజల నుంచి వసూలు చేసేందుకు ప్రభుత్వం కుట్ర పండుతుందని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆరోపించారు. 
బుధవారం ఆయననివాసంలో  విలేకరుల సమావేశం లో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆర్భాటాలు , అవినీతి అబద్దాలతో అవగాహన రాహిత్యంతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని, ప్రస్తుత కరువు కాలంలో సాగునీరు, కరెంటు, సరైన యూరియా, రైతుబంధు లేక రైతులు అప్పుల పాలవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కన్వర్టర్లు, జనరేటర్లు లేకుండా 24 గంటల పాటు ఉచిత విద్యుత్ అందిస్తే, నేడు రైతులు తమ పంటను కాపాడుకోవడానికి రోజుకు వేల రూపాయలు ఖర్చు చేసి డీజిల్ పోసుకోవాల్సిన దుస్థితి నెలకొందని విమర్శించారు. పెట్టుబడి కోసం అప్పులు చేసి, పంటలు ఎండిపోయి రైతు నడిరోడ్డు మీద విలపిస్తుంటే ప్రజలపై ప్రభుత్వం భారమోపేందుకు  సిద్ధమవుతుంది అన్నారు. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచితం అని చెప్పి, 201 యూనిట్లు దాటితే మొత్తం బిల్లు కట్టించుకుంటూ సామాన్యులను మోసం చేస్తున్నారని తెలిపారు. విద్యుత్ కోతలతో రైతులను ఇబ్బంది పెడితే గతంలో బషీర్ బాగ్ వద్ద జరిగిన పోరాటాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. పెంచిన బిల్లులను వినియోగదారులు కట్టవద్దని సూచించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిందని, కనీసం సచివాలయంలో పనిచేసే ఉద్యోగులకు మంచినీళ్ల బిల్లులు కూడా ప్రభుత్వం చెల్లించలేకపోయిందని విమర్శించారు. బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్ మంచినీళ్ల సరఫరాను నిలిపివేశారని తెలిపారు. కాంట్రాక్టర్లు తమ బిల్లుల కోసం సచివాలయంలో ధర్నాలు చేసే పరిస్థితి వచ్చిందని, 20 శాతం కమీషన్ ఇస్తేనే బిల్లులు మంజూరు చేస్తున్నారని ఆరోపించారు. గురుకుల పాఠశాలల్లో చదువుకుంటున్న దళిత, బహుజన విద్యార్థులకు కనీస పౌష్టికాహారం అందడం లేదని, దీంతో వారు ఆసుపత్రుల పాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 
కోదాడ ప్రభుత్వ పాఠశాల్లో 600 మంది పిల్లలకు కనీసం వంటగది కూడా నిర్మించలేకపోయారని విమర్శించారు. కల్యాణలక్ష్మి, పెన్షన్లు వంటి పథకాలను ప్రభుత్వం అటకెక్కించిందని ఆరోపించారు. ప్రభుత్వం కేవలం ప్రచార ఆర్భాటాలు, అబద్ధాలు, అవినీతితోనే పాలన సాగిస్తోందని విమర్శించారు. కావున హిట్లర్ తరహాలో పాలన సాగిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు. 
నిరుద్యోగులు, విద్యార్థులు, రైతులు, మరియు సామాన్యులకు ఏమాత్రం మేలు చేయని ఈ అనుభవరాహిత్య ప్రభుత్వానికి, రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడం ద్వారా చెంపపెట్టు లాంటి తీర్పునివ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు సుంకర అజయ్ కుమార్ , ఎస్.కె నయుం, తొగర్ రమేష్, వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు.