BREAKING
మౌలానా అబ్దుల్ కలాం సేవలు చిరస్మరణీయం ఆపదలో ఉన్న వారికి 5,000/- రు. ఆర్థిక సహాయం అందిస్తున్న..... పీపుల్స్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సర్వీస్ అధ్యక్షులు గూడవల్లి. గంగాధర్ దేశవ్యాప్తంగా పెరిగిన పాల ధరలు.. విద్యుత్ మోటార్ల దొంగల ముఠా అరెస్టు అదానీ కచ్ కాపర్‌కు అంతర్జాతీయ 'కాపర్ మార్క్' గుర్తింపు ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం -నూతన ఆవిష్కరణలు నైపుణ్యాభివృద్ధికి ప్రోత్సాహం : ప్రొ.వై.వి.రామిరెడ్డి ఆపరేషన్ గరుడ. మెడికల్ షాప్ లపై సర్ప్రైజ్ చెకింగ్. జయచంద్రకు ఉత్తమ ప్రిన్సిపాల్ అవార్డు ఆపిలేపల్లి ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదిన వేడుకలు. కేసీఆర్ హయాంలోనే తెలంగాణ రైతాంగానికి నిజమైన పండుగ అంతర్ కళాశాలల కబడ్డీ పోటీలు ప్రారంభం సర్పంచ్ బరిలో దేవరపల్లి ఆజాద్ --అందరితో సత్సంబంధాలు కలిగిన వ్యక్తిగా గుర్తింపు అంతర్జాతీయ స్థాయి క్రీడల లక్ష్యంగా.... ఎస్వీయూలో 14న జాబ్ మేళా ఎస్ఎస్సి 2026-27 పరీక్ష ఫీజు గడువు తేదీలు విడుదల పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ మార్చి 2027 లో జరగనున్న ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ ను ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ విడుదల చేసినట్లు పిడుగురాళ్ల మండల విద్యాశాఖ అధికారి శ్రీ ఎండీ ఖాసీం ఒక ప్రకటనలో తెలియజేశారు. మండలంలోని అన్ని య

30వ రోజుకు చేరిన జాతీయ ఆరోగ్య మిషిన్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమ్మె

Select Suryaa Now
30వ రోజుకు చేరిన జాతీయ ఆరోగ్య మిషిన్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమ్మె
సూర్య కామారెడ్డి జిల్లా ప్రతినిధి : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ లో జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నిరవధిక సమ్మె 30 రోజులకు చేరుకుంది. ప్రభుత్వం ఎటువంటి పరిష్కార మార్గాలు చూపకుండా తాత్సారం చేస్తుందని  ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మెలో భాగంగా ప్రభుత్వ తీరు పట్ల వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. సమ్మె శిబిరంలో అడుగుల చిత్రాలు వేసి నిరసన తెలిపారు. "ఈ అడుగులు కేవలం అడుగులు కావని,గ్రామ గ్రామాన తిరిగిన అడుగులనీ,గర్భిణీ స్త్రీల ఆరోగ్యం కోసం నడిచిన అడుగులనీ,చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు పరుగెత్తిన అడుగులనీ,ప్రజారోగ్యం కోసం ఎన్నో సంవత్సరాలు అలుపెరగకుండా పనిచేసిన అడుగులనీ చూపించారు.కానీ ఇన్ని సంవత్సరాల ప్రజాసేవ తర్వాత కూడా తమ జీవితాలకు ఉద్యోగ భద్రత లేదని వాపోయారు.తాము జాలి అడగడం లేదనీ, తమ సేవకు తగిన న్యాయం అడుగుతున్నామని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.తమ అడుగులకు అలసట ఉండొచ్చనీ, కానీ తమ న్యాయపోరాటానికి అలసట ఉండదన్నారు.ఇన్ని అడుగులు ప్రజల కోసం నడిచాయని, తమ భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఎప్పుడు అడుగు వేస్తుంది?" ప్రశ్నించారు. ఇకనైనా తమ హక్కుల సాధనకు ప్రభుత్వం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డా.వేణుమాధవ్, డా.రాహుల్, వెంకట రమణ, పద్మజ, అశ్విని, రాజు, డా.మారుతి, డా.హరీష్, కళ్యాణ్, అంకుశ్, గీత, రవితేజ, అఖిల్, హిమబిందు, అరుణ, జయశ్రీ, నిర్మల, రాశి,శిరీష తదితరులు పాల్గొన్నారు.