24 గంటలు పనిచేయని ఆసుపత్రి
*24 గంటలు పనిచేయని ఆసుపత్రి*
*ఆందోళన చెందుతున్న ప్రజలు*
ఆత్మకూరు /సూర్య న్యూస్: ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి కేవలం పేరుకు మాత్రమే 24 గంటలు అని అందులో సేవలు అందడం లేదని పలువురు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేవరపల్లి గ్రామానికి చెందిన రెండు సంవత్సరాల అబ్బాయి రాత్రి 8 గంటల సమయంలో ఆసుపత్రికి వెళ్ళగా రక్త పరీక్షలు చేయించాలని కానీ ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తపరీక్షలు చేయడానికి ఎవరూ లేరని చెప్పడంతో ఓ ప్రైవేటు ల్యాబ్ టెక్నీషియన్ వచ్చే రక్త పరీక్ష చేయడం జరిగింది. 24 గంటలు సేవలు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.