యాచారం మండలంలో పసుపుపచ్చ గుర్తులతో ప్రజలు ఆందోళనలు
యాచారం మండలంలో గుర్తులతో ప్రజలు ఆందోళన
భూసేకరణ కోసమా, రోడ్లు విస్తరణ కోసమా
పరిశ్రమల కోసమా?
రంగారెడ్డి జిల్లా, యాచారం మండలం లో మాల్, మొండి గౌరెల్లి, చింతపట్ల, సాగర్ హైవే రోడ్డు తదితర గ్రామాలలో పసుపు రంగుతో , ఎల్ ఆకారం ప్రక్కన, 21 32 33 35 38 39 42 నెంబర్ల గుర్తులతో వెలిసింది. స్థానికంగా ప్రజలలో ఆందోళనకు గురవుతున్నారు. భూ సేకరణ కోసమా, రోడ్లు విస్తరణ కోసమా, పారిశ్రామిక రంగాల అభివృద్ధి కోసమా? యాచారం మండల ప్రజలను ప్రభుత్వాలు, అధికారులు అయోమయ స్థితిలో పెడుతున్నారు. చివరికి యాచారం మండలాన్ని భూములు లేకుండా, చేస్తారా, ఇక్కడ ప్రజలు, ఇక్కడ నివసించాలా, అనే పరిస్థితిలో చర్చకు దారితీస్తున్నది.
కొండ్రు శివ, యాచారం సూర్య రిపోర్టర్