వెంకటాపూర్ లో భక్తిశ్రద్ధలతో మహా చండీ హోమం
ఘట్‌కేసర్, మేజర్ న్యూస్: శ్రీశ్రీ దేవి శరన్నవరాత్రోత్సవాలను పురస్కరించుకునివెంకటాపూర్ లో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపం వద్ద మహా చండీ హోమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. అమ్మవారి అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలని, గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేదమంత్రాలు, ప్రత్యేక పూజలతో మండపం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.ఈ మహా చండీ హోమంలో స్వాములు కందుల నవీన్ కుమార్ ముదిరాజ్, అందే అనంతరావు, చిలుక గణేష్, అందే శ్రీకాంత్, నీరుడి శ్రీనివాస్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తితో మొక్కులు చెల్లించుకున్నారు. శరన్నవరాత్రోత్సవాల సందర్భంగా నిర్వహించిన ఈ హోమంతో వెంకటాపురంలో భక్తిమయ వాతావరణం నెలకొంది. అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలగాలని భక్తులు ప్రార్థించారు.